మాట్లాడుతున్న మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓదెల, ఎలిగేడు మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రసాధనలో ముందుండి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు.
10ఏళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని అద్భుత పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌దే అని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ గ్రామాల్లో ప్రజలకు తెలియజేస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, నియోజకవర్గ నాయకురాలు దాసరి ఉష, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి, బైరెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment