బాలీవుడ్‌లో కపిల్ శర్మ షోకు ఉన్న పాపులారిటీనే వేరు. ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే...కపిల్ పిలిస్తే షోకు వస్తారు. అయితే కొంతకాలంగా కపిల్ అతిథులను ప్రోగ్రాంకు పిలవడం...అవి అనివార్య కారణాలతో వాయిదా పడటమో, రద్దు కావడమో జరుగుతోంది. తాజాగా భాగీ 2 టీం టైగర్ ష్రాఫ్, దిశాపటానీ షోకు ఆహ్వానించి తరువాత షూటింగ్ వాయిదా పడినట్టు ప్రకటించారు.
సాంకేతిక కారణాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు, త్వరలోనే మిగతా వివరాలను ప్రకటిస్తామని యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ షోకు పెద్ద స్టార్స్‌ను ఆహ్వానించడం... తర్వాత ఏవో కారణాలు చూపి వాయిదా వేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. కపిల్ శర్మ ఆరోగ్యం సహకరించడం లేదనీ, సినీ కార్మికుల బంద్‌లు జరుగుతున్నాయనీ యాజమాన్యం చెప్పుకొస్తోంది. గతంలో బిగ్‌బీ అమితాబ్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, పరేశ్ రావల్, మనోజ్ తివారి, అనిల్ కపూర్, అర్జున్‌కపూర్ లాంటి వారు వచ్చినప్పుడు కూడా కపిల్ శర్మ షో షూటింగ్‌లు రద్దు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment