Tiger Shroff Give Reaction On Dating With Akanksha Sharma After Break-Up With Disha Patani - Sakshi
Sakshi News home page

Tiger Shroff: ఆ హీరోయిన్‌తో బ్రేకప్‌, మరొకరితో డేటింగ్‌? స్పందించిన హీరో

Published Thu, Aug 11 2022 3:27 PM | Last Updated on Thu, Aug 11 2022 6:57 PM

Tiger Shroff Reacts On Dating with Akanksha Sharma - Sakshi

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌, బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ దిశా పటానీలు బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త వైరల్‌ అవుతోంది. అయితే ఆమెకు దూరమైన సమయంలో టైగర్‌ మరో నటికి దగ్గరయ్యాడంటూ బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసనోవా మ్యూజిక్‌ వీడియోలో తనతో పాటు కలిసి నటించిన ఆకాంక్ష శర్మతో అతడు డేటింగ్‌ చేస్తున్నాడంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఐయామ్‌ ఎ డిస్కో డ్యాన్సర్‌ 2.0 మ్యూజిక్‌ వీడియోలో కూడా కలిసి నటించారు.

ఇకపోతే టైగర్‌ ష్రాఫ్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆకాంక్షతో ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చిన టైగర్‌.. దిశాతో బ్రేకప్‌ నిజమేనా? కాదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇకపోతే టైగర్‌ ష్రాఫ్‌ త్వరలో ఢీలా, గణపత్‌: పార్ట్‌ 1, బడేమియా చోటేమియా, రాంబో చిత్రాల్లో కనిపించనున్నాడు.

చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్‌ నటి సీమంతం, ఫొటోలు వైరల్‌
పెళ్లి ఆలోచనలు లేవు.. మలైకాతో రిలేషన్‌పై హీరో కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement