Disha Patani Comment On Tiger Shroff Latest Video Amid Breakup Rumours - Sakshi
Sakshi News home page

టైగర్‌ ష్రాఫ్‌ వీడియోపై దిశా పటానీ స్పందన.. బ్రేకప్‌ రూమర్స్‌కు చెక్‌ పడినట్టేనా?

Published Sat, Aug 6 2022 12:06 PM | Last Updated on Sat, Aug 6 2022 1:43 PM

Disha Patani Comment On  Tiger Shroff Video Amid Breakup Rumours - Sakshi

హిందీ చిత్రపరిశ్రమలోని అందమైన జంటల్లో యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌, బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ దిశా పటానీ పెయిర్ ఒకటి. సినిమాల్లో వీరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు.  సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి టైగర్ ష్రాఫ్‌-దిశా పటానీ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. 

టైగర్ ష్రాఫ్‌-దిశా బ్రేకప్‌ చెప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలతో వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్‌ మాత్రం రెడీగా లేడట. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్‌.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్‌.

చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్‌' సాంగ్‌

ఇదిలా ఉంటే మరోవైపు వారిద్దరి రిలేషన్‌ సరిగ్గానే ఉందని ఇటీవల టైగర్‌ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్‌ చెబుతోంది. మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు చేస్తున్న వీడియోను టైగర్ ష్రాఫ్‌ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. 'నిజానికి ఇవాళ ట్రైనింగ్‌ తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే తమను కొట్టాల్సిందిగా వారు చెప్పారు. అది నా ఐడియా అయితే కాదు' అని ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని దిశా పటానీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిశా పటానీ రిప్లైతో వారి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని ఫ్యాన్స్‌ భావిస్తున్నారట. ఇక వారు డేటింగ్‌లో ఉన్నారా? లేదా బ్రేకప్‌ చెప్పుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.   

చదవండి: ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్‌ శంకర్ కుమార్తె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement