గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ టెక్నీషియన్స్‌తో విక్రమ్‌ ‘కర్ణ’ | Game Of Thrones Technicians For Vikram Mahavir Karna | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 1:39 PM | Last Updated on Tue, Dec 4 2018 2:15 PM

Game Of Thrones Technicians For Vikram Mahavir Karna - Sakshi

విలక్షణ నటుడు విక్రమ్‌ ప్రధాన పాత్రలో ఆర్‌ఎస్‌ విమల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం మహావీర్‌ కర్ణ. ముందుగా ఈ సినిమాను మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ హీరోగా 60 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రాజెక్ట్ విక్రమ్‌ చేతికి రావటంతో బడ్జెట్‌ రేంజ్‌ కూడా మారిపోయింది. యునైటెడ్‌ ఫిలిం కింగ్ డమ్‌ అనే అమెరికా నిర్మాణ సంస్థ ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించనుంది. 

త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఓ గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించటం ఆసక్తికరంగా మారింది. ఈ గంట సినిమాలో కీలంగా కనిపించనుందట. పూజల తరువాత ఆ గంటలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌కు తరలించారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాదాపు 32 భాషల్లో డబ్‌ చేసి రిలీజ్‌ చేయనున్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement