సాక్షి, అమరావతి: జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
‘‘సుపరిపాలన, ప్రభుత్వ విధానాలపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి మద్దతు తెలిపిన 1.16 కోట్ల కుటుంబాలకు, పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు. ‘‘ప్రజలకు మరింత సేవ చేసేందుకు దేవుని దయ, మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
మన పాలన పట్ల
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2023
మన ప్రభుత్వ విధానాల పట్ల
అచంచలమైన నమ్మకాన్ని ఉంచి
ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు.
మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా… pic.twitter.com/92DSw9eFFX
కాగా, వైఎస్సార్ సీపీ ప్రతిష్టాత్మక జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే శనివారం నాటితో రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలను కలిసి సీఎం జగనన్న పాలనపై వారి అభిప్రాయాలను సేకరించింది. సీఎం జగన్ పాలనకు 1.1 కోట్ల కుటుంబాలు మిస్డ్ కాల్ ద్వారా మద్దతు ప్రకటించారు.
చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు..1.1 కోట్ల మిస్డ్ కాల్స్
Comments
Please login to add a commentAdd a comment