థాంక్యూ సర్..నేను మీకు పెద్ద ఫ్యాన్ని | Ghulam Ali to perform in Delhi in December: Kejriwal | Sakshi
Sakshi News home page

థాంక్యూ సర్..నేను మీకు పెద్ద ఫ్యాన్ని

Published Fri, Oct 9 2015 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Ghulam Ali to perform in Delhi in December: Kejriwal

న్యూఢిల్లీ: పాకిస్తాన్ గజల్ మాస్ట్రో  గులాం అలీకి ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.  తన ఆహ్వానాన్ని మన్నించి  డిసెంబర్ లో  ఢిల్లీలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంగీకరించినందుకు ఆయన థాంక్స్ చెప్పారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో  శుక్రవారం షేర్ చేశారు.


గులాం అలీ సాబ్,  నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. మీతో   మాట్లాడ్డం చాలా సంతోషంగా ఉంది అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి ట్విట్ చేశారు. కాగా  ప్రఖ్యాత గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ వర్ధంతి సందర్భంగా  ముంబై, పుణే నగరాలలో జరిగే సంగీత కార్యక్రమాల్లో  పాల్గొనాల్సి ఉంది.   అయితే శివసేన బెదిరింపుల నేపథ్యంలో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో తమ నగరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ ఢిల్లీనేత  గులాం అలీ  ఆహ్వానించారు. దీంతో భారత్లోని అభిమానుల అలరించేందుకు  డిసెంబర్లో  కన్సర్ట్  నిర్వహించనున్నట్టు  అలీ  ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement