సచిన్ టెండూల్కర్, జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(పాత చిత్రం)
జమ్మూకశ్మీర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు.
ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్ కేటాయించాడు.
Comments
Please login to add a commentAdd a comment