mehabooba mufti
-
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
Kashmir: రాహుల్ భారత్ జోడో యాత్రలో మెహబూబా ముఫ్తీ..
శ్రీనగర్: భద్రతా లోపాల కారణంగా కశ్మీర్లో శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం శనివారం మళ్లీ ప్రారంభమైంది. అవంతిపొర నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మరోసారి సోదురుడితో పాటు కలిసి నడిచారు. #WATCH | Congress party's Bharat Jodo Yatra resumes from Awantipora, Jammu & Kashmir. PDP chief Mehbooba Mufti joins Rahul Gandhi in the yatra. (Video: AICC) pic.twitter.com/l3fLfIoTu5 — ANI (@ANI) January 28, 2023 #WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra joins Rahul Gandhi in the party's Bharat Jodo Yatra at Awantipora, Jammu & Kashmir. pic.twitter.com/Awr5MgyH2z — ANI (@ANI) January 28, 2023 భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ ఒబ్దుల్లా రాహుల్‌తో పాటు యాత్రలోనే ఉన్నారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని భారత్ జోడో యాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా జనవరి 30న శ్రీనగర్‌లో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖులు ఈ సభకు హాజరవుతున్నారు. చదవండి: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
‘‘ఆమె డీఎన్ఏ తేడా.. భారత్ ఓడిపోతే.. టపాసులు కాల్చింది’’
చండీగఢ్: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి తర్వాత దేశంలో రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. టీమిండియా ఓటమితో బాధలో ఉన్న క్రీడాభిమానులు మన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి.. తలలు పట్టుకుంటున్నారు. టీమిండియా ఓటమి అనంతరం పలువురు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వారి జాబితాలోకి హరియాణా హెల్త్ మినిస్టర్ అనిల్ వీజ్ చేరారు. పాకిస్తాన్ విజయంపై స్పందించిన అనిల్ విజ్.. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డీఎన్ఏలోనే ఏదో లోపం ఉందన్నారు. ముఫ్తీలో భారతీయత ఏ మేరకు ఉందో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. సోమవారం మెహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్‌ని ఉద్దేశించి అనిల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: టీమిండియాతో మ్యాచ్: పాక్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు) ‘‘టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ సాధించిన గెలుపును కొందరు కశ్మీరీలు సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మిఠాయిలు పంచుకున్నారు కొందరు. వారు గుర్తులేరా’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. దీనిపై అనిల్ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: Ind Vs Pak: భారత్ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి ) ‘‘మెహబూబా ముఫ్తీ డీఎన్ఏలోనే ఏదో తేడా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆమె మాత్రమే కాదు పాకిస్తాన్ విజయం సాధించిన సందర్భంగా కొందరు టపాసులు కాల్చారు. వారి డీఎన్ఏ కూడా తేడానే. మన చుట్టూ దాక్కున్న దేశ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ అనిల్ విజ్ ట్వీట్ చేశారు. पाकिस्तान के क्रिकेट मैच जीतने पर भारत में पटाखे फोड़ने वालों का डीएनए भारतीय नहीं हो सकता । संभल के रहना अपने घर में छुपे हुए गद्दारों से । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) October 26, 2021 చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..! -
వేర్పాటువాద నాయకుడు గిలానీ మృతి, సంతాపదినంగా ప్రకటించిన పాక్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, నిషే ధిత జమాత్-ఈ-ఇస్లామీ సభ్యుడు, హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ(92) మృతి చెందారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గిలానీ గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 2008 నుంచి కూడా గిలానీ గృహనిర్బంధంలో ఉన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ పదవికి గతేడాది ఆయన రాజీనామా చేశారు. మొదట ఆయన జమాతే ఈ ఇస్లామి కశ్మీర్ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు గిలానీ మృతిపట్ల పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం గిలానీ మరణంతో కశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతోపాటు మొబైల్ సేవలను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, ఇతర ప్రధాన నగరాల్లో భద్రతా దళాలను మోహరించాలని అధికారులు ఆదేశించారు. వాహనాల రాకపోకలకు అనుమతి లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు గిలానీ మృతిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. అంతేకాదు ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన గిలానీని భారత ప్రభుత్వం వేదించిందని ఆరోపించారు. ఆయనకు నివాళిగా ఈ రోజు పాక్ జెండాను అవనతం చేసి, అధికారిక సంతాప దినంగా పాటిస్తామని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Saddened by the news of Geelani sahab’s passing away. We may not have agreed on most things but I respect him for his steadfastness & standing by his beliefs. May Allah Ta’aala grant him jannat & condolences to his family & well wishers. — Mehbooba Mufti (@MehboobaMufti) September 1, 2021 We in Pakistan salute his courageous struggle & remember his words: "Hum Pakistani hain aur Pakistan Humara hai". The Pakistan flag will fly at half mast and we will observe a day of official mourning. — Imran Khan (@ImranKhanPTI) September 1, 2021 -
ఆర్టికల్ 370ని పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను
కశ్మీర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్న ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదా, ఆర్టికల్ 370, 35ఏని పునరిద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు’’ అన్నారు. ‘‘మా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. దాని ప్రకారమే నడుచుకుంటుంది. అందుకే ప్రధాని ఆహ్వానం మేరకు మేం ఢిల్లీ వచ్చి.. మోదీతో సమావేశం అయ్యాము. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలతో సమావేశం కావడం ముఖ్యం కాదు. ప్రజలతో కలిసిపోయి.. వారిలో విశ్వాసం నింపాలి. వారి నమ్మకాన్ని గెల్చుకోవాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం’’ అన్నారు మెహబూబా ముఫ్తీ. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ వెల్లడించారు. చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు -
మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ
కశ్మీర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, కశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో గత ఏడాది ఈడీ జప్తు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది. -
మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.త్రివర్ణ పతాకంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశభక్తి మనోభావాలను దెబ్బతీయంటూ సొంత పార్టీ నేతలే విమర్శించారు. ముఫ్తీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు పీడీపీ నేతలు త్రిలోక్ సింగ్ బజ్వా, పుర్బ లెసిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే వేద్ మహాజన్, గుజ్జర్ నేత చౌదరి మహమ్మద్ హుస్సేన్ రాజీనామా చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలు క్షమించరానివని వ్యాఖ్యానిస్తూ ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని లేఖలో పేర్కొన్నారు. ఇక గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నాయకులను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. (గుప్కార్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా ఎన్నిక ) కాగా 14 నెలల నిర్బంధం తర్వాత శుక్రవారం జైలు నుంచి విడుదలైన ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను దొంగలు అని అభివర్ణిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. (తీవ్ర దుమారం రేపుతున్న ముఫ్తీ వ్యాఖ్యలు ) -
‘ఆగస్టు 5 అవమానాన్ని మర్చిపోను’
కశ్మీర్: గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని మాలో ఎవరూ మర్చిపోలేము అన్నారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. 14 నెలల నిర్బంధం తర్వాత మంగళవారం రాత్రి ఆమెను విడుదల చేశారు. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశిస్తూ ముఫ్తీ.. ‘ఢిల్లీ దర్బారు ఆర్టికల్ 370 ని చట్ట విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేక పద్దతిలో రద్దు చేసింది. దాన్ని తిరిగి సాధిస్తాం. ఇదే మాత్రమే కాదు కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దీని కోసం అనేక మంది కశ్మీరీలు తమ ప్రాణాలు వదులుకున్నారు. ఇందుకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మార్గం సులభం కాదని మాకు తెలుసు. కానీ మా పొరాటాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు నన్ను విడిచి పెట్టారు.. ఇంకా చాలా మంది చట్ట విరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారు. వారందరిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాను’ అన్నారు ముఫ్తీ. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొదట్లో ఆమెను ఐపీసీ 107, 151 సెక్షన్ల కింద అరెస్టు చేశామన్న యంత్రాంగం అనంతరం వివాదాస్పద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కేసు నమోదు చేసింది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా 3 నెలల పాటు నిర్బంధంలో కొనసాగించేందుకు వీలుంటుంది. గత ఏడాది ఆగస్టు 5వ తేదీన మెహబూబాను అదుపులోకి తీసుకుని చెష్మా షాహి అతిథి గృహంలో కొంతకాలం, ఎంఏ లింక్ రోడ్డులోని మరో అతిథి గృహంలో మరికొంతకాలం ఉంచారు. అక్కడి నుంచి ఆమెను సొంతింట్లోనే గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ప్రభుత్వ చర్యను సవాల్ చేస్తూ మెహబూబా కుమార్తె ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సెప్టెంబర్ 29వ తేదీన విచారించిన అత్యున్నత న్యాయస్థానం..ఇంకా ఎంతకాలం మెహబూబాను నిర్బంధంలో ఉంచుతారని కేంద్రం, కశ్మీర్ యంత్రాంగాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ గడువు ముగియనున్న క్రమంలో ఆమెను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం.(చదవండి: చైనా పాలనే నయం అనుకునేలా..) -
ఇదొక చీకటి రోజు : ముఫ్తి
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఈ మేరకు...‘ 1947లో (దేశ విభజన సమయంలో) భారత కూటమిలో చేరుతూ జమ్మూ కశ్మీర్ నాయకత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు అవకాశం కల్పించారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు చీకటి రోజు’ అని ముఫ్తి ట్వీట్ చేశారు. ఇక ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో భారీగా బలగాలను మోహరించిన కేంద్రం.. తాజా నిర్ణయాల నేపథ్యంలో మరో 8 వేల బలగాలను శ్రీనగర్‌కు పంపింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి : కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కాగా ఆర్టికల్ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌ను మూడు ముక్కలు చేసేలా జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు కోరుతున్నారని అమిత్ షా చెప్పారు. ఇక కేంద్రం నిర్ణయంతో కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
‘భారత్-పాక్ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’
న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రతిపక్షాలన్ని ఈ విషయంలో మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. భారత్, పాక్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఫ్తీ కోరారు. ఈ సందర్భంగా ముఫ్తీ.. ‘జమ్మూకశ్మీర్ అంశంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని తెలుసు. అయితే ట్రంప్ చేసిన ప్రకటన భారీ మార్పులను సూచిస్తోంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో అమెరికాకు గొప్ప రికార్డేం లేదు. కానీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను రెండు దేశాలు సీరియస్‌గా తీసుకుంటే బాగుంటుంది. చర్చల ద్వారా శాంతి స్థాపనకు ఇది మంచి అవకాశం. ఇరు దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. Despite GOI refuting idea of third party mediation on J&K, the disclosure made by Trump marks a huge policy shift. Even though USA doesn’t hold a great record in resolving protracted conflicts, hope both countries seize this opportunity to forge peace through dialogue. — Mehbooba Mufti (@MehboobaMufti) July 23, 2019 కశ్మీర్ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ట్విటర్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా మోదీ.. ట్రంప్‌ను కోరలేదని స్పష్టం చేశారు. కశ్మీర్ సమస్య రెండు దేశాలకు సంబంధించిందని, ఈ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని భారత్ చాన్నాళ్లుగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఒమర్..బాదం తిని మెమరీ పెంచుకో’
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో రాజకీయ వారసులు ఒమర్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీ మరోసారి ట్వీట్ వార్‌కు దిగారు. ఈసారి మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వి ప్రజ్ఞ బీజేపీలో చేరడం వారి ట్వీట్ దాడికి కేంద్ర బిందువైంది. బీజేపీలో చేరిన సాధ్వి ప్రజ్ఞను బీజేపీ భోపాల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీగా బరిలోకి దింపింది. బీజేపీలో ప్రజ్ఞ చేరికపై పీడీఎఫ్ చీఫ్ మెహబూబా ముఫ్తీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాను ఉగ్రవాద నిందితుడిని పోటీలో నిలిపితే ఎలాంటి ఆగ్రహం పెల్లుబుకుతుందో ఊహించండి..మీడియా ఛానెల్స్ విపరీత ధోరణితో ప్రచారం చేసేవని ట్వీట్ చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని చెప్పే వీరే ముస్లింలంతా ఉగ్రవాదులేనని చెబుతారని, నిర్ధోషిగా నిరూపించుకునేవరకూ ముద్దాయిలేనని మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రజ్ఞను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మెహబూబా ట్వీట్‌కు స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ఇదే బీజేపీ మిమ్మల్ని అధికారం నుంచి తప్పించేవరకూ మీ మిత్ర పక్షంగా ఉన్నారని, 2014లో అధికారంలోకి రాకముందే బీజేపీ తీరు ఇలాగే ఉన్నా జూన్ 2018 తర్వాతే వారి పాపాలను మీరు గుర్తించారని, అధికార దాహంతో మీకు వారి పాపాలు కనిపించలేదని దుయ్యబట్టారు. ఒమర్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మెహబూబా ముఫ్తీ మరో ట్వీట్లో.. అటల్ బిహారి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వామిగా ఉన్నప్పుడు బీజేపీ హిందుత్వ రాజకీయాల గురించి ఒమర్ అబ్ధుల్లాకు ఏమీ తెలియదని సెటైర్లు వేశారు. గోద్రా ఘటనల అనంతరం బీజేపీతో నేషనల్ కాన్ఫరెన్స్ అంటకాగిన విషయం గుర్తులేదా అంటూ ఒమర్‌కు చురకలు వేశారు. ఒమర్ బాదం పప్పు తిని జ్ఞాపక శక్తి పెంచుకోమని మెహబూబా తనదైన శైలిలో స్పందించారు. -
మెహబుబా ముఫ్తీ వాహన శ్రేణిపై రాళ్ల దాడి
శ్రీనగర్ : పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బైక్ ర్యాలీపై సోమవారం రాళ్ల దాడి జరిగింది. అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఎస్కార్ట్ వాహనం ధ్వంసమైంది. ఖిరాం గ్రామంలో దర్గాను సందర్శించి బిజ్బెహరా పట్టణానికి తిరిగి వస్తుండగా ఆమె వాహన శ్రేణిపై కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దుండగుల బారి నుంచి ఆమెను కాపాడిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. భద్రతా సిబ్బంది సాయంతో ఆమె బిజ్బెహరా పట్టణానికి చేరుకుని కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రాళ్ల దాడిలో మెహబూబా ముఫ్తీ డ్రైవర్‌కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆమె అనంత్‌నాగ్ స్ధానం నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో ఇదే నియోజకవర్గం నుంచి మెహబూబా గెలుపొందిన సంగతి తెలిసిందే. -
వాళ్లని ఉతికితే.. మరకలు పోతాయి!
‘మరక మంచిదే’ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంఎఫ్‌జీ దిగ్గజం హిందూస్థాన్ యూనీలివర్ రూపొందించిన సరికొత్త యాడ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న హెచ్‌యూఎల్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేయాలంటూ #boycottSurfexcel పేరిట నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచేలా యాడ్ రూపొందించిన సర్ఫ్ ఎక్సెల్‌ను నిషేధించాలి. హిందూ బాలికను, ముస్లిం బాలుడిని ఎంచుకుని లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్నారు. అలాగే హోలి రంగులను మరకలు అని ఎలా అంటారు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘ఇంత అందమైన ఫిల్మ్‌ను రూపొందించిన వారికి ధన్యవాదాలు. ఈ యాడ్‌ను వ్యతిరేకించడమంటే భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వం భావనకు విరుద్ధంగా వ్యవహరించినట్లే’ అని ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్లపై స్పందించిన కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి.. ‘నాదొక మంచి సలహా. భక్తులను సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతకాలి. ఎందుకంటే మరకలు పోగొట్టడమే కదా సర్ఫ్ పని’ అని వ్యంగంగా ట్వీట్ చేసి సర్ఫ్ ఎక్సెల్‌కు అండగా నిలిచారు. ఆ యాడ్‌లో ఏముందంటే... హోలి పండుగ రోజు ముస్లిం బాలుడు, హిందూ బాలిక కలిసి సైకిల్‌పై వెళ్తూంటారు. వైట్ డ్రెస్ ధరించిన ఆ బాలిక హోలి రంగులు పడకుండా తన వెనుక ఉన్న స్నేహితుడిని రక్షిస్తుంది. ఆ తర్వాత అతడిని దగ్గర్లో ఉన్న మసీదులో దిగబెట్టగా అతడు నమాజ్ చేసేందుకు పరిగెడతాడు. నిమిషం నిడివి ఉన్న ఈ యాడ్ మరక మంచిదే అనే ట్యాగ్‌లైన్‌తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ యాడ్ ఇప్పటికే దాదాపు 85 లక్షల వ్యూస్ సాధించింది. అయితే హిందుత్వ వాదులు మాత్రం తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు హిందూస్థాన్ యూనీలివర్ చవకబారు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు. కాగా రెడ్ లేబుల్ టీ పౌడర్ ప్రమోషన్ కోసం హెచ్‌యూఎల్ ఇటీవల రూపొందించిన యాడ్ వివాదాస్పమైన సంగతి తెలిసిందే. ‘వృద్ధులను వదిలించుకోవడం కోసం చాలా మంది కుంభమేళాను ఎన్నుకుంటారు. కానీ మన పెద్దల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం నిజంగా విచారకరం. ఈ రోజు మనల్ని ఇలా తయారు చేసిన వారి చేతులను వదలకండి’ అంటూ ట్వీట్ చేసిన ఈ యాడ్‌పై నెటిజన్లు మండిపడ్డారు. I have a better suggestion. Bhakts should be washed properly with Surf Excel. Kyunki Surf ki dhulai daag ko karain saaf. https://t.co/YiYrW4AM2j — Mehbooba Mufti (@MehboobaMufti) March 10, 2019 -
కేంద్రంపై కశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజా వ్యాఖ్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేశాయి. అసెంబ్లీని తాను రద్దు చేయకుంటే కేంద్రం ఒత్తిడి కారణంగా జేకేపీసీ (జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్) పార్టీ అధినేత సజ్జాద్‌లోన్‌తో తాను సీఎంగా ప్రమాణం చేయించాల్సి వచ్చేదని సత్యపాల్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీ లేని వ్యక్తిగా మిగిలిపోవడం ఇష్టం లేకనే తాను అసెంబ్లీని రద్దు చేశానని పేర్కొన్నారు. ‘ఇప్పుడు ఆ సమస్య మొత్తం ముగిసింది. ఎవరేమనుకున్నా, నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నా మనస్సు చెబుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ పాలనలో ఉన్న కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్‌ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్‌ను పీడీపీ కోరడం, తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ మద్దతుతో తామూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జేకేపీసీ సంప్రదించడంతో గవర్నర్ సత్యపాల్ అసెంబ్లీనే రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాల మేరకే గవర్నర్ ఇలా చేశారని కాంగ్రెస్ ఆరోపించగా.. ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్- మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాత్రం భిన్నంగా స్పందించారు. శాసనసభను రద్దు చేయకుండా సమావేశపరిచి గవర్నర్ బలపరీక్ష నిర్వహించి ఉంటే ఎవరి బలం ఎంతో తేలేదని ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడగా... ‘ఫ్యాక్స్ యంత్రాన్ని పట్టించుకోకుండా, కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసి అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ నిర్ణయం జమ్మూ కశ్మీర్‌కు నిజంగా గొప్పది’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు. -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
‘ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’
శ్రీనగర్ : గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను శ్రీనగర్‌లో ఉన్నందున గవర్నర్‌ను ప్రత్యక్షంగా కలవలేకపోతున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోట ఫ్యాక్స్ పనిచేయనందున ఈ మెయిల్ ద్వారా లేఖను పంపిస్తానని తెలిపారు. కాగా పీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఫ్తీ ముందుకొచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. Have been trying to send this letter to Rajbhavan. Strangely the fax is not received. Tried to contact HE Governor on phone. Not available. Hope you see it @jandkgovernor pic.twitter.com/wpsMx6HTa8 — Mehbooba Mufti (@MehboobaMufti) November 21, 2018 -
పాకిస్తాన్‌తో చర్చలు జరపండి..!
శ్రీనగర్ : పాకిస్తాన్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో భారత్ చర్చలు జరపాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభించి కశ్మీర్ లోయలో పారుతున్న రక్తపుటేరులను ఆపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్‌లోని రాజోరిలో మంగళవారం మీడియా సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ.. పాక్‌లో నూతనంగా ఏర్పడిన ఇమ్రాక్ ఖాన్ భారత్‌తో చర్చలకు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణం తరువాత కశ్మీర్లో ఆందోళన కొంతమేరకు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కశ్మీర్లో మిలిటెంట్స్, భద్రతా దళాల మధ్య కాల్పులతో అమాయక ప్రజలకు తీవ్ర నష్టం జరుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల అనంతనాగ్ జిల్లాలో ఓ కుటుంబంలోని తొమ్మిది సభ్యులను మిలిటెంట్స్ అపహరించుకుపోతే.. భద్రతా ధళాలు వారి చెరనుంచి విడిపించిన విషయం తెలిసిందే. వాజ్‌పేయి సమయంలో బీజేపీ-పీడీపీ సంబంధాలు బలంగే ఉండేవని.. ప్రస్తుత బీజేపీ నాయకత్వ లోపంగానే వారిమధ్య విభేదాలు తలేత్తాయని ముఫ్తీ ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీతో కూటమి అంటే విషం తాగినట్లేనని ముఫ్తీ ఆరోపించిన విషయం తెలిసిందే. -
జమ్మూకశ్మీర్‌లో కమలం ప్రభుత్వం ఏర్పాటు ?
-
జమ్మూకశ్మీర్‌కు హిందూ ముఖ్యమంత్రి?
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో కమలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందా?. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినట్లు జాతీయ మీడియా ఓ కథనాన్ని వెలువరించింది. ప్రధానమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిర్మల్ సింగ్ ప్రధాని మోదీతో మంతనాలు చేశారు. నిర్మల్ సింగ్‌తో సమావేశానికి ముందు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్చార్జి, పార్టీ సెక్రటరీ రామ్ మాధవ్‌తో మోదీ ఇవాళ ఉదయం సుదీర్ఘ చర్చలు జరిపారని కూడా తెలిసింది. దీంతో పీడీపీ నుంచి వచ్చే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందనే ఊహాగానాలకు బలం చేకూరింది. కశ్మీర్లో బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగే. ఆయన హిందూ కూడా. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అమర్నాథ్ యాత్ర తర్వాత బీజేపీ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నాయకులు పెదవి విప్పడం లేదు. నాయకుల వరుస పర్యటనలు గవర్నర్ పాలన విధించిన తర్వాత కశ్మీర్‌కు బీజేపీ సీనియర్ నాయకులు కొందరు తరచుగా వెళ్లి వస్తున్నారు. పీడీపీతో విడిపోయిన పది రోజుల తర్వాత రామ్ మాధవ్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్లోన్తో ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన ఆయన మోదీని కలసి మంతనాలు జరిపారు. ఈ నెలలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్‌లు సైతం శ్రీనగర్‌కు వెళ్లివచ్చారు. పీడీపీ రెబల్స్ మద్దతు.. పీడీపీలోని రెబల్ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబీద్ అన్సారీ మెహబూబా నాయకత్వాన్ని బాహాటంగానే ప్రశ్నించారు. నాయకత్వంలో మార్పు లేకపోతే పీడీపీ రెండుగా చీలిపోతుందని సంచలన వ్యాఖ్యలను సైతం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎందుకు కాకూడదు? అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, కశ్మీర్లో ప్రభుత్వ పదవి కాలం మరో రెండేళ్లు ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ ముందున్న సవాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. సుప్తచేతనావస్థలో ఉన్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి తిరిగి ప్రాణ ప్రతిష్ట చేయాలంటే 44 మంది సభ్యుల మెజార్టీ అవసరం. ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరో 19 మంది ఎమ్మెల్యేలు కావాలి. పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు బీజేపీకే దక్కనున్నందున మరో 17 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టాలి. పీడీపీ తిరుగుబాటు వర్గం నుంచే మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ఒక్కటే ప్రస్తుతం బీజేపీ ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపిస్తున్నారు. -
సంకీర్ణంలో కొనసాగలేం..గవర్నర్ పాలన తప్పనిసరి
-
రాజకీయంగా నష్టపోయినా భరించాం
-
రంగంలోకి అమిత్‌షా.. ఏమైనా జరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రంగ ప్రవేశంతో జమ్ము కశ్మీర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంగళవారం ఉదయం ఉన్నపళంగా రావాలంటూ జమ్ము కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలకు సమన్లు జారీ చేయటంతో.. వారంతా హస్తిన చేరుకున్నారు. ఈ క్రమంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)-బీజేపీ పొత్తు తెగదెంపుల దాకా వెళ్లిందా? అన్న కోణంలో జాతీయ మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. రంజాన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలానుసారం నెల రోజుల పాటు భారత సైన్యం కాల్పుల విరమణను పాటించింది. వేర్పాటువాదులతో చర్చలకు ఇదే మంచి తరుణమని జమ్ము కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ.. కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. అయితే సరిగ్గా రంజాన్‌కు రెండు రోజుల ముందు 'ది రైజింగ్ కశ్మీర్' సంపాదకుడు సుజాత్ భుకారీ హత్య, ఆపై ఆర్మీ రైఫిల్ మ్యాన్ ఔరంగజేబును ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణను పక్కనబెట్టి, చర్యలకు ఉపక్రమించాలని సైన్యానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది పీడీపీ వర్గాలకు ఏ మాత్రం సహించలేదు. కాల్పుల విరమణను మరికొంత కాలం పొడిగించి ఉంటే శాంతిచర్చలు ఓ కొలిక్కి వచ్చి ఉండేవేమోనని ఆమె భావించారు. కానీ, హఠాత్తుగా(తమను మాట వరుసకు కూడా సంప్రదించకుండా) కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఫ్తీ జీర్ణించుకోలేకపోయారు. కశ్మీర్లో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతాయన్న ఆందోళనలో ఆమె ఉన్నారు. ఇప్పటికే చాలా అంశాల్లో పీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు ఉండగా, కాల్పుల విరమణపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై మెహబూబా ముఫ్తీ అసంతృప్తితో రగలిపోతున్నారు. ఈ తరుణంలో అమిత్ షా నుంచి పిలుపు అందుకున్న కశ్మీర్ బీజేపీ ఎమ్మెల్యేలు.. భేటీ కావటం విశేషం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, భద్రతాంశాలపై ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా చర్చించనున్నట్లు బోగట్టా. అదే సమయంలో పీడీపీతో విడిపోతే వచ్చే పరిస్థితులపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం సాగుతున్న తీరుపై బీజేపీ నేతల్లోనూ అసంతృప్తి పెరిగిపోయినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. -
ఇరకాటంలో పీడీపీ,బీజేపీ సంకీర్ణ సర్కార్!
-
సీఎంతో ఎలాంటి సమస్యల్లేవు : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : కథువా హత్యాచార ఘటన.. బీజేపీ మంత్రుల రాజీనామాలు.. తదితర పరిణామాల నేపథ్యంలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)తో పొత్తు సంగ్ధిగ్ధంలో పడ్డట్లు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ స్పందించారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఎలాంటి సమస్యల్లేవని ఆయన ప్రకటించారు. (నోరువిప్పిన మోదీ) శుక్రవారం రాత్రి ఢిల్లీలో రామ్ మాధవ్ ఓ జాతీయ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘కూటమి విషయంలో ఎలాంటి సమస్యల్లేవు. మంత్రుల రాజీనామా పూర్తిగా బీజేపీ నిర్ణయమే. సీఎం మెహబూబా ముఫ్తీ మాపై ఒత్తిడి తెచ్చినట్లు వస్తున్న కథనాలు నిజం కాదు. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ కూడా ఆమెకు సూచించారు. పీడీపీతో పొత్తు కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల బాలికను కొందరు అహరించి.. బంధించి.. డ్రగ్స్ ఇచ్చి.. ఆపై అత్యాచారం.. కిరాతకంగా హింసించి చంపిన ఘటన తెలిసిందే. జనవరిలో జరిగిన ఈ దాష్టీకంలో విస్మయకర విషయాలు ఆలస్యంగా వెలుగులోకి రావటంతో ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులకు మద్ధతుగా నిర్వహించిన ఓ ర్యాలీలో బీజేపీకి చెందిన మంత్రులు చంద్ర ప్రకాశ్ గంగా, లాల్ సింగ్‌లు పాల్గొనటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో చివరకు శుక్రవారం సాయంత్రం వారిద్దరూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించి బీజేపీ అధిష్ఠానం వారి భవితవ్యం నిర్ణయించనుంది. కథువా కేసులో వరుస పరిణామాల కోసం క్లిక్ చేయండి -
సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు
జమ్మూకశ్మీర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు. ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్ కేటాయించాడు.