
మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి
సాక్షి, శ్రీనగర్ : లైంగిక దాడి ఆరోపణల కేసులో అరెస్టయిన ఓ పోలీసు అధికారి విడుదల కోసం కొందరు చేసిన నిరసనలపట్ల జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భయందోళన వ్యక్తం చేశారు. ఒక రేపిస్టును కాపాడేందుకు జాతీయ జెండాతో నిరసన వ్యక్తం చేస్తారా అని, ఈ పరిణామం తనకు తీవ్ర కలవరం కలిగించిందని చెప్పారు. జమ్ములోని కథువా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన కేసులో ఓ ప్రత్యేక పోలీసు అధికారి దీపక్ ఖల్జూరియాను పోలీసులు గత వారం అరెస్టు చేశారు.
అయితే, అతడిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో జాతీయ జెండాను పట్టుకొని హిందూ ఏక్తామంచ్ గురువారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించింది. దీనిపై సీఎం ముఫ్తీ స్పందిస్తూ ‘కథువా జిల్లాలో అరెస్టు అయిన ఓ రేపిస్టు విడుదల కోసం కొంతమంది నిర్వహించిన మార్చ్‌లు, నిరసనల తీరు ఆందోళనకరం. ఇలాంటి నిరసనలకోసం జాతీయ జెండాను ఉపయోగిస్తుండటం చూస్తుంటే భయపడాల్సిన పరిస్థితి. ఇది జాతీయ జెండాను అవమానించడం తప్ప మరొకటి కాదు’ అని ముప్తీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment