శ్రీనగర్: భద్రతా లోపాల కారణంగా కశ్మీర్‌లో శుక్రవారం అర్థాంతరంగా ఆగిపోయిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రం శనివారం మళ్లీ ప్రారంభమైంది. అవంతిపొర నుంచి రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా మరోసారి సోదురుడితో పాటు కలిసి నడిచారు.
#WATCH | Congress party's Bharat Jodo Yatra resumes from Awantipora, Jammu & Kashmir. PDP chief Mehbooba Mufti joins Rahul Gandhi in the yatra.
— ANI (@ANI) January 28, 2023
(Video: AICC) pic.twitter.com/l3fLfIoTu5
#WATCH | Congress General Secretary Priyanka Gandhi Vadra joins Rahul Gandhi in the party's Bharat Jodo Yatra at Awantipora, Jammu & Kashmir. pic.twitter.com/Awr5MgyH2z
— ANI (@ANI) January 28, 2023
భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆగిపోయింది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ ఒబ్దుల్లా రాహుల్‌తో పాటు యాత్రలోనే ఉన్నారు. భద్రతా వైఫల్యంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకుని భారత్ జోడో యాత్రకు పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ సందర్భంగా జనవరి 30న శ్రీనగర్‌లో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు, ఇతర ప్రముఖులు ఈ సభకు హాజరవుతున్నారు.
చదవండి: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Comments
Please login to add a commentAdd a comment