
రాహుల్ గాంధీ జీవితంలో అసలు పెళ్లి ప్రస్తావన ఉందా?.. అనే అనుమానం..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(52) మరోసారి పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు. సరైన వ్యక్తి దొరికితేనే తాను పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన.
Curly Tales తరపున ఇంటర్వ్యూ చేసిన యాంకర్.. మొహమాటంగానే పర్సనల్ ప్రశ్న అడగొచ్చా అంటూ పెళ్లి గురించి ప్రస్తావించింది. అసలు రాహుల్ గాంధీ జీవితంలో పెళ్లి ప్రస్తావన ఉందా? చేసుకోరా? అని అడిగింది. దీంతో ఆయన.. సరైన వ్యక్తి తగిలితే తప్పకుండా వివాహం చేసుకుంటానని బదులిచ్చారు.
ప్రత్యేకించి ఎలాంటి విశేషాలేమైనా ఉండాలా? యాంకర్ అడగ్గా.. అలాంటివేం లేదని, ప్రేమగా ఉండి, తెలివైన వ్యక్తి అయి ఉంటే చాలని రాహుల్ బదులిచ్చారు. దీంతో బయట ఎంతో మందికి ఈ సందేశం వెల్లిందని యాంకర్ సరదాగా చెప్పగా.. నన్ను ఇప్పుడు ఇబ్బందిలో పడేస్తున్నారా? అంటూ యాంకర్‌తో చమత్కరించారాయన.
ఇదిలా ఉంటే.. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇంతకు ముందు కూడా తన పెళ్లి గురించి ప్రస్తావించారు కూడా. తన తల్లి(సోనియా గాంధీ), నానమ్మ(ఇందిరా గాంధీ)ల గుణాల కలబోత ఉన్న అమ్మాయి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటానని పేర్కొన్నారాయన. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఆయన యాత్ర కొనసాగుతోంది. జనవరి 30వ తేదీన యాత్ర శ్రీనగర్‌లో ముగియనుంది.
Rahul Gandhi ji's Chit-chat on marriage with Kamiya Jani of curly tales. pic.twitter.com/IGABLIerbu
— Nitin Agarwal (@nitinagarwalINC) January 22, 2023