మెహబూబా ముఫ్తీ (ఫైల్ ఫోటో)
శ్రీనగర్ : పాకిస్తాన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో భారత్ చర్చలు జరపాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభించి కశ్మీర్ లోయలో పారుతున్న రక్తపుటేరులను ఆపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్‌లోని రాజోరిలో మంగళవారం మీడియా సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ.. పాక్‌లో నూతనంగా ఏర్పడిన ఇమ్రాక్ ఖాన్ భారత్‌తో చర్చలకు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణం తరువాత కశ్మీర్‌లో ఆందోళన కొంతమేరకు తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కశ్మీర్‌లో మిలిటెంట్స్, భద్రతా దళాల మధ్య కాల్పులతో అమాయక ప్రజలకు తీవ్ర నష్టం జరుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల అనంతనాగ్ జిల్లాలో ఓ కుటుంబంలోని తొమ్మిది సభ్యులను మిలిటెంట్స్ అపహరించుకుపోతే.. భద్రతా ధళాలు వారి చెరనుంచి విడిపించిన విషయం తెలిసిందే. వాజ్‌పేయి సమయంలో బీజేపీ-పీడీపీ సంబంధాలు బలంగే ఉండేవని.. ప్రస్తుత బీజేపీ నాయకత్వ లోపంగానే వారిమధ్య విభేదాలు తలేత్తాయని ముఫ్తీ ఇటీవల వ్యాఖ్యానించారు. బీజేపీతో కూటమి అంటే విషం తాగినట్లేనని ముఫ్తీ ఆరోపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment