ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్ పరిణామాలపై అంతర్జాతీయ సమాజంలో మద్దతు లభించక అసహనానికి లోనవుతున్న పాకిస్తాన్ మరో కుదుపునకు లోనైంది. ప్రధాని నరేంద్ర మోదీకి యూఏఈ అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జయేద్‌ను అందచేయడం పాక్‌కు మింగుడుపడటం లేదు. ప్రధాని మోదీకి ఆదివారం ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్-యూఏఈల మధ్య పెరుగుతున్న సంబంధాలకు సంకేతంగా పరిగణిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతోంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయ సమాజానికి పాక్ ఏకరువు పెడుతున్నా మద్దతు కొరవడుతున్న క్రమంలో దుబాయ్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించడం పొరుగుదేశానికి అసంతృప్తి మిగిల్చింది. ప్రధానికి ఈ పురస్కారం ప్రకటించగానే పాక్ సెనేట్ ఛైర్మన్ సాధిక్ సంజరాని యూఏఈ పర్యటనను రద్దు చేసుకోవడం ఇవే సంకేతాలను పంపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment