ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ | Chief Minister Mehbooba Mufti met Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ

Published Sat, Aug 27 2016 12:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ - Sakshi

ప్రధానితో కశ్మీర్ సీఎం భేటీ

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం గత 50 రోజులుగా రాష్ట్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కశ్మీర్ సీఎం ప్రధానితో ఇవాళ తొలిసారిగా సమావేశమయ్యారు. ముఫ్తీతో సమావేశం అనంతరం కశ్మీర్లో శాంతి పునరుద్ధరిచాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ఈ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా ఆక్కడి రాజకీయపార్టీలన్నీ సమైఖ్యంగా పనిచేయాలన్నారు.

ఇటీవల తనను కలిసిన జమ్మూకశ్మీర్ ప్రతిపక్షాల బృందం నిర్మాణాత్మకమైన సలహాలిచ్చిందని ప్రధాని కితాబిచ్చారు. కశ్మీర్ అల్లర్లకు పాకిస్తాన్ ప్రేరేపిస్తుందని మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్ పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ ఇటీవల రెండు రోజుల పాటు శ్రీనగర్లో పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అల్లర్లలో ఇప్పటివరకు 60 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. వేల సంఖ్యలో యువకులు గాయపడ్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement