టర్కీలో వచ్చిన భారీ భూకంపం కారణంగా సుమారు 30 వేల మంది దాక చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ 'ఆపరేషన్ దోస్త్'లో భాగంగా టర్కీకి తక్షణ సాయం అందించడమే గాక పలు రెస్క్యూ బృందాలను కూడా పంపించింది. అందులో భాగంగానే భారత్ 23 టన్నులకు పైగా సహాయక సామాగ్రితో మరో ఏడవ ఆపరేషన్ దోస్త్ విమానాన్ని టర్కీకి పంపించింది. ఆ విమానం ఆదివారం భూకంప బాధిత సిరియాకు చేరుకుంది. దీనిని డమాస్కస్ విమానాశ్రయంలోని స్థానిక పరిపాలన, పర్యావరణ డిప్యూటీ మంత్రి మౌతాజ్ డౌజీ అందుకున్నారు.
ఈ మేరకు టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ సోమవారం తమ దేశానికి మరోసారి సహాయక సామాగ్రిని పంపినందుకు భారతదేశానికి ధన్యవాదాలు తెలిపారు. రాయబారి సునెల్ ట్విట్టర్ వేదికగా.. భారత ప్రజల నుంచి మరో బ్యాచ్ అత్యవసర విరాళాలు టర్కీకి చేరుకున్నాయి. భూకంపం సంభవించిన ప్రాంతానికి ప్రతి రోజు ఎంతో ఉదారంగా ఉచిత సహాయాన్ని అందజేస్తోంది. అందుకు భారతదేశానికి ధన్యావాదాలు.
వందల వేల మంది భూకంప నుంచి బయటపడిన వారందరికి ఈ సమయంలో గుడారం, దుప్పటి, స్లీపింగ్ బ్యాగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. అలాంటి వాటన్నింటిని ఈ విపత్కర సమయంలో మా ప్రజలకు అందించి ఎంతో మేలు చేసింది. లాంఛనప్రాయంగా ప్రారంభమైన ఈ 'ఆపరేషన్ దోస్త్' మనం ఎప్పటికీ స్నేహితులమని నిరూపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలోపేతం కావలి అని ట్వీట్ చేశారు.
THANK YOU INDIA! 🇮🇳🇮🇳🇮🇳
— Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 13, 2023
Each tent, each blanket or sleeping bag are of vital importance for the hundreds of thousands of earthquake survivors. https://t.co/v9rsXtdzjL
(చదవండి: ఉక్రెయిన్ మరితంగా బ్రిటన్ మిటలరీ సాయం..మండిపడుతున్న రష్యా)
Comments
Please login to add a commentAdd a comment