న్యూఢిల్లీ:బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారత్(India)లోకి చొరబాట్లను అడ్డుకునేందుకు సరిహద్దులో కంచె నిర్మాణంపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను బంగ్లాదేశ్ విదేశాంగశాఖ ఆదివారం పిలిచి వివరణ కోరింది.
ఈ వ్యవహారంపై భారత్ కూడా ధీటుగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ నురల్ ఇస్లామ్‌కు విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది.దీంతో ఆయన సోమవారం(జనవరి13) విదేశాంగశాఖ కార్యాలయానికి చేరుకుని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సరిహద్దులో అయిదుచోట్ల కంచెల ఏర్పాటుకు భారత్ ప్రయత్నిస్తోందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఇప్పటికే ఆరోపణలు చేసింది.
ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ(Pranay Verma)కు బంగ్లాదేశ్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌కు వివరణ ఇచ్చిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ కంచెల విషయంలో రెండు దేశాల రక్షణ దళాలు బీఎస్‌ఎఫ్,బీజీబీ (బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్)లు ఓ అవగాహనతో ఉన్నాయన్నారు.సరిహద్దు వెంట నేరాల నియంత్రణకు ఈ అవగాహన కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment