
గురువింద చందంగా చంద్రబాబు తీరు..
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజానీకానికి టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజానీకానికి టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మొత్తంలో ఈ సభకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. సభ నుంచి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పారు.
అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు తీరు గురువింద చందంగా ఉందని విమర్శించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ కొనుగోలు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో ఎందుకు రాజీనామా చేయించలేదని కూడా ఆయన మరో ప్రశ్న వేశారు.