minister jagadeesh reddy
-
టీఆర్ఎస్ పార్టీలో చేరిక
నేరేడుచర్ల : పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌కు చెందిన ఐఎన్టీయూసీ మండల నాయకుడ, 9వ వార్డు సభ్యుడు కాటూరి శేషగిరి ఆదివారం టీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ ఆధ్వర్యంలో రాష్త్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లచ్చిరాం నాయక్, జాన్‌పహాడ్ టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శ్రీను, జింకల భాస్కర్, గుమ్మడెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెలను పంపిణీ చేసిన మంత్రి
నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని ఊట్కూరు గ్రామంలో మంగళవారం ఉదయం గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని గొర్రెలను పంపిణీ చేశారు. నల్గొండ లోకసభ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ తదితరులు పాల్గొన్నారు. ఊట్కుర్ గ్రామంలో యాదవులు మంత్రి జగదీష్ రెడ్డికి సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికారు. -
విద్యుత్ సమస్య రానీయం
యాదగిరిగుట్ట : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తోందన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందిస్తామన్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. అలాగే ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఉన్నారు. -
గురుకుల విద్యార్థులు భేష్: సీఎం
* మెడిసిన్‌లో 40, బీడీఎస్‌లో 20 సీట్లు సాధిస్తుండటం అభినందనీయం * ఎస్సీ, ఎస్టీ గురుకులాల ఫలితాల స్ఫూర్తితోనే మైనారిటీ గురుకులాలు * ప్రతిభావంతులైన విద్యార్థులకు పారితోషికాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ఫలితాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మెడిసిన్‌లో 40 సీట్లు, బీడీఎస్‌లో 20 సీట్లు సాధించేలా ర్యాంకులు పొందడంతోపాటు ఇతర పోటీ పరీక్షల్లో సత్తా చాటడం శుభపరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్య, భోజనం, వసతి, శిక్షణ అందించడంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అంకితభావంతో పనిచేస్తున్నారని అభినందించారు. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం తప్పక ఫలితం ఇస్తుందని నిరూపించారని పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ క్రిస్టిల్ (ఏబీసీ) ద్వారా 2015-16 సంవత్సరానికి 110 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎంసెట్‌లో శిక్షణ ఇప్పించగా, వారిలో మెజారిటీ విద్యార్థులకు మెడిసిన్, బీడీఎస్‌లలో సీట్లు వచ్చే స్థాయిలో ర్యాంకులు వచ్చాయి. సొసైటీకి చెందిన విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో 25 మంది, టీఐఎస్ఎస్లో ఆరుగురు, అజీం ప్రేమ్‌జీ సంస్థలో 11 మంది, ఐఐటీల్లో 45 మంది, నిట్‌లలో ఐదుగురు, సీఏ కోర్సుల్లో ఐదుగురు ప్రవేశాలు పొందారు. ఎస్టీ విద్యార్థులు 9 మంది మెడిసిన్‌లో, నలుగురు బీడీఎస్‌లలో, 50 మంది ఐఐటీ, నిట్ వంటి సంస్థల్లో ప్రవేశం పొందారు. ఈ ఫలితాలపై కేసీఆర్ స్పందిస్తూ, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు సాధించిన విజయాలను చూసిన తర్వాత మైనారిటీలకు గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యా సంస్థలను అంకితభావంతో నడుపుతున్నారని ప్రవీణ్‌కుమార్‌కు సీఎం ఫోన్ చేసి అభినందించారు. గురుకుల విద్యార్థుల చదువు పట్ల సీఎం చూపిస్తున్న శ్రద్ధ కారణంగానే ఈ ఫలితాలని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సొసైటీ వైస్ చైర్మన్ మహేశ్‌దత్ ఎక్కా, కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా డీఎస్‌ఓఏ వి.రంగారెడ్డి, గౌలిదొడ్డి ప్రిన్సిపాల్ ప్రమోద తదితరులు మంత్రిని కలసి విద్యార్థుల ప్రతిభ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన జగదీశ్.. మెడిసిన్‌లో సీట్లు పొందే 40 మంది విద్యార్థులకు రూ.50 వేల చొప్పున, బీడీఎస్‌లో సీట్లు సాధించే వారికి రూ.40 వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు తెలిపారు. -
ఆ పత్రికలో మాపై తప్పుడు వార్తలు’
-
ఆ పత్రికలో మాపై తప్పుడు వార్తలు’
నల్లగొండ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సీబీఐకి అప్పగించాలని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నయీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత పత్రికలో తమపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కోమటిరెడ్డి శుక్రవారమిక్కడ ఆరోపించారు. తాము తప్పు చేసినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్న శివధర్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కోమటిరెడ్డి మండిపడ్డారు. తమకు ప్రజాసేవే ముఖ్యమని, తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ కు తాము మొదటి నుంచి వ్యతిరేకమన్నారు. తాము నిప్పులా బతికామని, అలాగే బతుకుతామని అన్నారు. చట్టవిరుద్ధమైన పనులు చేయాల్సిన అవసరం తమ జీవితాల్లోనే లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మెయోచన విరమణ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను విద్యుత్ ఉద్యోగులు విరమించుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికులకు పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గురైతే వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు. -
‘విద్యుత్’ సమ్మె యథాతథం
ఈ నెల 14లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే 15 నుంచి సమ్మె తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ స్పష్టీకరణ 14న మంత్రి జగదీశ్‌రెడ్డితో మరో దఫా చర్చలకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఈ నెల 14వ తేదీలోపు పరిష్కరించకపోతే 15వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్ పునరుద్ఘాటించింది. సమస్యలను పరిష్కరించని పక్షంలో ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగుతారని ఫ్రంట్ చైర్మన్ ఎన్.పద్మారెడ్డి, కన్వీనర్ ఈ. శ్రీధర్ శనివారం తెలిపారు. అధికార పార్టీ టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఆర్వీకేఎస్ మినహా రాష్ట్రంలో మిగిలిన 13 విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల కలయికతో ఏర్పడిన ఈ ఫ్రంట్... కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఆలోగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాల చెల్లింపు డిమాండ్లు సహా మొత్తం 34 డిమాండ్ల పరిష్కారం కోరుతూ గత నెల 19న విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఉత్తర, దక్షిణ డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, కె.వెంకటనారాయణ శనివారం విద్యుత్‌సౌధలో ఫ్రంట్ నేతలతో చర్చలు జరిపారు. సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయని, తక్షణమే కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించామని చర్చల అనంతరం డి.ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. తక్షణమే పరిష్కరించలేని డిమాండ్లను ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగించాలని ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చాయన్నారు. విధానపర నిర్ణయాలతో ముడిపడిన డిమాండ్లపై ఈ నెల 14న సచివాలయంలో ఉదయం 11 గంటలకు విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో మళ్లీ చర్చలకు రావాలని యాజమాన్యాలు ఆహ్వానించగా ట్రేడ్ యూనియన్ల నేతలు అంగీకరించారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నామని, ఈ నెల 15నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని ప్రభాకర్‌రావు ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. 13న ఆందోళనలు ... విద్యుత్ సంస్థల సీఎండీలతో జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు నేరుగా వేతనాల చెల్లింపుతో పాటు అదనపు పోస్టుల మంజూరు, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు బదలాయింపు, తదితర డిpower employess strike will be as usualమాండ్లను పరిష్కరించాల్సిందేనని ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలు పట్టుబట్టారు. ఈ అంశాలపై ప్రభుత్వ అనుమతి అవసరమని యాజమాన్యాలు స్పష్టం చేశాయని ఫ్రంట్ కన్వీనర్ ఈ. శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న తలపెట్టిన ఆందోళనలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ గేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాల్లో మార్పులేదన్నారు. -
సోలార్ విద్యుత్‌పై ప్రత్యేక శ్రద్ధ
సనత్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే మిగులు విద్యుత్‌ను సాధించిందని, ఈ క్రమంలోనే సోలార్ సంప్రదాయ విద్యుత్ ఉత్పాదనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ), సురభి ఎడుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం బేగంపేట్‌లోని స్వామిరామానంద తీర్థ మెమోరియల్ కమిటీ హాల్లో ‘సోలార్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యకిరణాలు ఎప్పటికీ తిరిగిపోనివని, గ్రీన్ ఎనర్జీగా పిలుచుకునే సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 800 మెగావాట్ల ఉత్పత్తి చేశామని, మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం సోలార్ ఎనర్జీతో విద్యుత్ వ్యయం తగ్గిపోయిందన్నారు. తద్వారా నిర్మాణ, సరఫరా వ్యయాల్లో దుబారా తగ్గించగలిగామన్నారు. 2020 నాటికి దేశంలో 1,75,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్ష్యంగా నిర్ణయించారని, తెలంగాణలో కూడా అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన వివరించారు. సోలార్ సంప్రదాయ విద్యుత్ ఉత్పాదన నిపుణులు, టెక్నీషియన్ల కొరత ఉందని, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చన్నారు. జెన్కో చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ దేవులపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ ఉత్పాదనలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో వాణీదేవి, నారాయణరావు,పీవీ ప్రభాకర్‌రావు, సీనియర్ జర్నలిస్ట్ జ్వాలా నర్సింహారావు, ప్రోగ్రామ్ డెరైక్టర్ శేఖర్ మారంరాజు, ఎస్ఆర్ఎస్ విన్ సోలార్ ఎండీ రామరాజు, డెరైక్టర్ టీఎస్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనార్క్ సర్టిఫికేషన్, సూర్యన్ ఇన్స్టాలేషన్ కోర్సులకు సంబంధించిన బ్రోచర్‌ను మంత్రి విడుదల చేశారు. -
అవినీతిని తగ్గించుకోండి
వ్యవసాయ, విద్యుత్ శాఖల సమీక్ష సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ : ‘జిల్లా విద్యుత్ శాఖలో అధికారులు, ఉద్యోగులు అవినీతిని తగ్గించుకోండి.. చిన్న చిన్న తప్పులు చేసిన ఉద్యోగులు దొరుకుతున్నారు.. కానీ ఎప్పుడూ తప్పులు చేస్తూ తింటున్న వాళ్లు తప్పించుకుంటున్నారు.’అని జిల్లా విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సొంత శాఖ పనితీరుపైనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్, వ్యవసాయ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఏసీబీ పట్టుబడిన కేసుల్లో ఎక్కువ మంది విద్యుత్ శాఖ ఏఈలే ఉన్నారు.. దీంతో కిందిస్థాయి ఉద్యోగులను ఉద్దేశిస్తూ మాట్లాడిన మంత్రి చిన్న చిన్న తప్పులకు అనవసరంగా బలవుతున్నారని...పై స్థాయిలో ఉంటూ ఎప్పుడూ తప్పులు చేస్తున్న అధికారులు సులువుగా తప్పించుకుంటున్నారని చురకలు అంటిం చారు. నిజాయితీగా మీరు వ్యవహరిస్తే.. మేం మీ జోలికి రాకుండా ఉంటామని.. మా వైపు నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలుఉంటాయని హామీ ఇచ్చారు. సీఎం, మంత్రులు ఏవిధంగా అయితే నిజాయితీగా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా అధికారులు నడుచుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు రిపేరుకు వచ్చిన వాటిని రోజుల తరబడి ఉంచుకోకుండా రెండు, మూడు గంటల్లో రిపేర్లు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు కట్టిన రైతులకు ప్రాధాన్యత క్రమంలో మంజూరు చేయాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు అవసరమయితే తన దృష్టికి తీసుకరావాలన్నారు. డబ్బులు ఆశించకుండా పనిచేసేందుకు అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విత్తనాల కొరత రాకుండా చూడాలి వర్షాలు కురుస్తున్నందున రైతులకు విత్తనాల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదే శించారు. ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉంటారు కాబట్టి పెసర, కంది విత్తనాల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాకు సబ్సిడీ విత్తనాలు రాలేదన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథితో ఫోన్లో మాట్లాడి జిల్లాకు తక్షణమే 4 వేల క్వింటాళ్ల పెసర విత్తనాలు పంపించాలని కోరారు. మన తెలంగాణ-మన వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ పనితీరును మంత్రి అభినందించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా ప్రతి మండలంలో వెయ్యి ఎకరాలు పెసర సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించి రైతులు ఎలాం టి సమస్య ఎదుర్కొన్నా దానికి మండల స్థాయిలో పనిచేసే అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ సమన్వయంతో ఏమండలానికి ఏ మేరకు ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అంచనా వేయాలన్నారు. శాఖాపరంగా ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈస మావేశంలో కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, జేసీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, పాండ్య తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకంఠమహేశ్వరుడి సన్నిధిలో మంత్రి పూజలు
ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని శ్రీకంఠమమహేశ్వరస్వామి ద్వితీయ కల్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గౌడ కులస్తులు ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి-సురమాంబదేవిల సన్నిధిలో పూజలు చేసిన తర్వాత మంత్రిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. దీంట్లోభాగంగా స్థానికులు స్వామివారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కసగాని లక్ష్మిబ్రహ్మంగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వై.వెంకటేశ్వర్లు, కాకి దయాకర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గునగంటి శ్రీను, బట్టిపెల్లి వెంకన్న, వెంకట్రాములు, గునగంటి వెంకన్న, భిక్షం తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 12 ఆర్టీఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మల్కాపురంలో వాహన ఫిట్నెస్ కేంద్రం పనులకు శంకుస్థాపన చౌటుప్పల్ : ప్రజల సౌకర్యార్థం రాష్ర్ట వ్యాప్తంగా నూతనంగా 12 ఆర్టీఏ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని కోదాడలో ఓ కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. రూ.16కోట్ల వ్యయంతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కాలం చెల్లిన వాహనాలను పరీక్షించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న వాహన సామర్థ్య కేంద్రం (వెహికిల్ ఫిట్నెస్ సెంటర్) పనులకు మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. సిరిసిల్లలో రూ.20కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకనుంచి వాహనాలు ఫిట్‌నెస్‌లో ఉంటేనే రోడ్లపై తిరుగుతాయన్నారు. రెండేళ్లకోసారి ప్రతి వాహనాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో యేటా 8వేల మంది మృత్యువాతపడుతున్నారన్నారు. అందుకు కారణం ఫిట్నెస్ లేని వాహనాలు, అవగాహన లేని డ్రైవింగే కారణమన్నారు. అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌సుల్తానియా, జాయింట్ కమీషనర్ పాండురంగానాయక్, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ సోమ అరుణ, ఆర్టీఓ హనుమంతారెడ్డి, ఎంవీఐ, ఏఎంవీఐలు పాల్గొన్నారు. ‘పెంటావాలెంట్’తో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ నల్లగొండ టౌన్ : పెంటావాలెంట్ టీకా వేయిండం వలన చిన్నారులను ఐదు ప్రాణాంతక వ్యాధుల నుం చి కాపాడవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్కుమార్లతో కలిసి చిన్నారులకు పెంటావాలెంట్ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ టీకాతో ఐదు రకాల వ్యాధులైన కంటసర్పి, కోరంతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బీబీ, హెమోఫిలస్ ఇన్ఫూయెంజా వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించుకోవచ్చన్నారు. ప్రతి చిన్నారి తల్లిదండ్రులు టీకాను విధి గా వేయించి వారిని ఆరోగ్యవంతులుగా ఉంచాలని సూచించారు. టీకాలు వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీఐఓ డాక్టర్ ఏబీ నరేంద్ర, డీఎంఓ ఓంప్రకాశ్, డెమో తిరుపతిరెడ్డి, ఇన్ చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఉదయ్‌సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ అమర్, డాక్టర్ మాతృ, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ చందు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, అభిమన్యు, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన సంస్థాన్ నారాయణపురం అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డిలు అన్నారు. గుడిల్కాపురం నుంచి సంస్థాన్ నారాయణపురం వరకు రూ.6 కోట్లుతో 6 కిలోమీటర్లు రోడ్డు విస్తరణ పనులకు బుధవారం గుడిమల్కాపురంలో మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పుట్టపాక నుంచి బట్టోనిబావి, జనగాం, గంగమూల తండా వరకు రూ.2.97 కోట్లతో చేపట్టిన 6.4కిలోమీటర్ల రోడ్డు పనులకు పుట్టపాకలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యాం కల్పించాడనికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీటీసీ సభ్యుడు బొల్ల శివశంకర్, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి, ఆర్బీ ఎస్ఈ ఎం.లింగయ్య, ఈఈ బాలస్వామి, డీఈ సుదర్శన్ సర్పంచ్‌లు కొన్రెడ్డి సుగణమ్మ, నల్లగొండ కళమ్మ, ఏర్పుల అంజమ్మ, ఎంపీటీసీలు సామల వెంకటేశం, పానుగోతు సుజాత, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కాంతమ్మ, ఏఈ ఆస్తార్అన్సర్, మన్నే ఇంద్రసేనారెడ్డి, పాశం ఉపేందర్‌రెడ్డి, శ్రీరాముల నర్సింహ్మ, తెలంగాణ భిక్షం, దేపా విప్లవరెడ్డి, అలీంఅసద్, పరదేశి ఉన్నారు. -
ఆధునికీకరణ పనులు వేగిరం చేయాలి
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి సాగర్ ఎడమ కాల్వ సీసీ లైనింగ్ పనుల పరిశీలన హాలియా : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని, పనుల నాణ్యతలో రాజీపడోద్దని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండలంలోని హాలియా వద్ద మొదటి ప్యాకేజీ కింద కొనసాగుతున్న సీసీ లైనింగ్ పనులను శుక్రవారం మంత్రి జగదీష్‌రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఎన్ఎస్పీ అధికారులతో కలసి చర్చించారు. అదేవిధంగా మండలంలోని ఇబ్రహింపేట గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎడమ కాల్వ ద్వారా చెరువులను నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల చేసి పెద్దదేవులపల్లి, అనాజిపురం, దోసపాడు చెరువులను నింపి అటు నుంచి సూర్యాపేటకు తాగునీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హాలియా నుంచి వేములపల్లి వరకు ఎడమ కాల్వపై ప్రయాణం దోసపాడు చెరువు ద్వారా సూర్యాపేటకు తాగునీరు అందించే క్రమంలో సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తే ఎదురయ్యే ప్రతిబంధకాలను అంచ నా వేయడం కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి మండలంలోని హాలియా నుంచి వేములపల్లి మండల కేంద్రం వరకు సాగర్ ఎడమ కాల్వపై ప్రయాణీంచారు. ఎడ మ కాల్వ పరిధిలో ఆయా ప్యాకెజీల్లో గతంలో, ప్రస్తుతం జరుగుతున్న పను లు, కాల్వ స్థితిగతులను పరిశీలించారు. కాల్వకు నీటి విడుదల చేసే విషయంలో మరోసారి ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడినాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, సీఈ పురుషోత్తమ్మరాజు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలు ఉన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి హాలియా : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్డడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియాలో సాగర్ ఎడమ కాల్వపై మొదటి ప్యాకేజీలో జరుగుతున్న ఆధుకికీకరణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావం వల్ల జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదన్నారు. జలాశయాల్లో నీరు లేక మంచినీటి స్కీమ్‌లు పనిచేయని కారణంగా మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట వంటి పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి దాపురించిందని పేర్కొన్నారు. ప్రధాన పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన వెంట నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు, ఎస్ఈ విజయబాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ నాయకులు కేవీ రామారావు, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, పోచం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమళ్ల సత్యం, వర్రా వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
గురువింద చందంగా చంద్రబాబు తీరు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, ప్రజానీకానికి టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మొత్తంలో ఈ సభకు హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. సభ నుంచి తిరిగి వెళుతూ ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన చెప్పారు. గాయపడిన వారికి ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పారు. అనంతరం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు తీరు గురువింద చందంగా ఉందని విమర్శించారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీ కొనుగోలు చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో ఎందుకు రాజీనామా చేయించలేదని కూడా ఆయన మరో ప్రశ్న వేశారు.