రాష్ట్ర రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మల్కాపురంలో వాహన ఫిట్‌నెస్ కేంద్రం పనులకు శంకుస్థాపన
చౌటుప్పల్ : ప్రజల సౌకర్యార్థం రాష్ర్ట వ్యాప్తంగా నూతనంగా 12 ఆర్టీఏ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని కోదాడలో ఓ కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. రూ.16కోట్ల వ్యయంతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కాలం చెల్లిన వాహనాలను పరీక్షించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న వాహన సామర్థ్య కేంద్రం (వెహికిల్ ఫిట్‌నెస్ సెంటర్) పనులకు మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం శంకుస్థాపన చేశారు.
శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. సిరిసిల్లలో రూ.20కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకనుంచి వాహనాలు ఫిట్‌నెస్‌లో ఉంటేనే రోడ్లపై తిరుగుతాయన్నారు. రెండేళ్లకోసారి ప్రతి వాహనాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో యేటా 8వేల మంది మృత్యువాతపడుతున్నారన్నారు.
అందుకు కారణం ఫిట్‌నెస్ లేని వాహనాలు, అవగాహన లేని డ్రైవింగే కారణమన్నారు. అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌సుల్తానియా, జాయింట్ కమీషనర్ పాండురంగానాయక్, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ సోమ అరుణ, ఆర్టీఓ హనుమంతారెడ్డి, ఎంవీఐ, ఏఎంవీఐలు పాల్గొన్నారు.
‘పెంటావాలెంట్’తో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ
నల్లగొండ టౌన్ : పెంటావాలెంట్ టీకా వేయిండం వలన చిన్నారులను ఐదు ప్రాణాంతక వ్యాధుల నుం చి కాపాడవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌కుమార్‌లతో కలిసి చిన్నారులకు పెంటావాలెంట్ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ టీకాతో ఐదు రకాల వ్యాధులైన కంటసర్పి, కోరంతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బీబీ, హెమోఫిలస్ ఇన్ఫూయెంజా వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించుకోవచ్చన్నారు.
ప్రతి చిన్నారి తల్లిదండ్రులు టీకాను విధి గా వేయించి వారిని ఆరోగ్యవంతులుగా ఉంచాలని సూచించారు. టీకాలు వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీఐఓ డాక్టర్ ఏబీ నరేంద్ర, డీఎంఓ ఓంప్రకాశ్, డెమో తిరుపతిరెడ్డి, ఇన్ చార్జి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఉదయ్‌సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ అమర్, డాక్టర్ మాతృ, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ చందు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, అభిమన్యు, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 12 ఆర్టీఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
Published Wed, Jun 10 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement