విద్యుత్ ఉద్యోగుల సమ్మెయోచన విరమణ | telangana electricity employees calls off strike | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల సమ్మెయోచన విరమణ

Published Tue, Jun 14 2016 3:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

telangana electricity employees calls off strike

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను విద్యుత్ ఉద్యోగులు విరమించుకున్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికులకు పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గురైతే వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement