
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలకు పీవీ సింధు తండ్రి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలకు పీవీ సింధు తండ్రి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సింధును సీఎం జగన్ అభినందించారన్నారు. సింధు కచ్చితంగా పతకం గెలవాలని సీఎం జగన్ ఆకాంక్షించారని పేర్కొన్నారు. సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు పూర్తి సహకారం అందించారని రమణ తెలిపారు.
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.