అభివృద్ధికి సహకరించిన ఎంపీలకు కృతజ్ఞతలు | thanks to mps | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సహకరించిన ఎంపీలకు కృతజ్ఞతలు

Published Thu, Sep 8 2016 1:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

thanks to mps

కర్నూలు:  దత్తత గ్రామం కప్పట్రాళ్ల అభివృద్ధికి సహకరించినందుకు కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్‌.పి.వై.రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌లకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కప్పట్రాళ్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం(మరమ్మతులు) నంద్యాల ఎంపీ ఎస్‌.పి.వై.రెడ్డి తన కోటా నిధుల నుంచి రూ.8.50 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ రూ.25 లక్షల నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. కొత్తగా నిర్మించిన జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ ప్రహరీకి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక రూ.10 లక్షల నిధులు విడుదల చేశారని వెల్లడించారు. రైతుసంఘం కార్యాలయ నిర్మాణానికి(2 గదులు) మంత్రాలయం మఠాధిపతులు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఆయా పనులు వచ్చే నాలుగు నెలల్లో పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement