‘మహా’ సీఎంను కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు..! | Ram Charan Special Thanks To Maharashtra CM And People For Hospitality | Sakshi
Sakshi News home page

Ram Charan: మీ అతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: రామ్ చరణ్‌

Published Fri, Dec 22 2023 5:46 PM | Last Updated on Fri, Dec 22 2023 6:38 PM

Ram Charan Special Thanks To CM and People For Hospitality - Sakshi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా ‍అద్వానీ కనిపించనుంది. ఈ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్‌ కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ముంబై వెళ్లారు. నగరంలోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ముద్దుల కూతురు క్లీంకారతో కలిసి తొలిసారి ఆలయానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్‌ నెలలో ఈ జంటకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: పెళ్లి పీటలెక్కనున్న సీనియర్ హీరోయిన్ కుమారుడు.. వధువు ఎవరంటే?)

అయితే ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చెర్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రజల అతిథ్యం, అప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement