
సాక్షి, అమరావతి: తన తండ్రి నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారు గర్వపడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి హర్షం
ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నా’నంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: (కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ)
(NTR District: కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి)