వాటిని పోస్ట్‌ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పిన అనుష్క శర్మ | Anushka Sharma Say Thanks To Media For Not Publishing Vamika Photo | Sakshi
Sakshi News home page

Anushka Sharma: వాటిని పోస్ట్‌ చేయనందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పిన అనుష్క శర్మ

Published Sun, Dec 19 2021 9:06 PM | Last Updated on Sun, Dec 19 2021 11:46 PM

Anushka Sharma Say Thanks To Media For Not Publishing Vamika Photo - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలలో కొందరి పిల్లలకు పుట్టగానే సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చేస్తుంది. ఇక అప్పటి నుంచి ఆ చిన్నారులు ఏం చేసిన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. దీనికి భిన్నంగా టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల కూతురు వామికా కోహ్లీ అసలు ఎలా ఉంటుందని కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పైగా  ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి వామికాకు సంబందించిన ఏ ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు విరుష్క జంట.

తాజాగా ఇందుకు సంబంధించి బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన కుమార్తె వామిక ఫోటోలను ప్రచురించనందుకు మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కోహ్లీ, అనుష్క, వామికాతో కలిసి బయటకు రాగా వామిక ఫోటోని తీశారన్న వార్తలు వచ్చాయి. దీంతో వామిక ఫోటోలను పోస్ట్‌ చేయకండని ఈ జంట మీడియాని అభ్యర్థించారు. దీనిపై స్పందిస్తే అనుష్క తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో .. వామికా ఫోటోలు/వీడియోలను పోస్ట్‌ చేయనందుకు మీడియా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపూతూ.. మేము మా చిన్నారి గోప్యతను కాపాడాలనుకుంటున్నాము.

ఎందుకుంటే భవిష్యత్తులో ఆమె జీవితాన్ని స్వేచ్ఛగా జీవించడానికే మేము మీడియాకు దూరంగా ఉంచుతున్నాము. అందుకు మా వంతు కృషి చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ విషయంలో సంయమనం పాటించాలని అనుష్క ఆ పోస్ట్‌లో తెలిపింది. అంతకుముందు, ముంబై నుంచి దక్షిణాఫ్రికాకు జట్టు బయలుదేరే సమయంలో వామికా ఫోటోలు తీయవద్దని విరాట్ కోహ్లీ ఫోటోగ్రాఫర్‌లను అభ్యర్థించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. "బేబీ కా ఫోటో మాట్ లీనా (దయచేసి పాప ఫోటోలు క్లిక్ చేయకండి)" అని కోహ్లి ఆ వీడియోలో చెప్పాడు. ఏదైమైనా వామిక ప్రైవసీ విషయంలో విరుష్క జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చదవండి: Sushmita Sen: సుస్మితా సేన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. అందుకు 27 ఏళ్లు పట్టిందట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement