
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రపదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికెట్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఖజానా శాఖ సంచాలకులు స్పష్టం చేయడంపై సంఘం ప్రధాన కార్యదర్శి టి.ఎం.బి. బుచ్చిరాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ పెన్షనర్లందరూ ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా లైఫ్ సర్టిఫికెట్‌లు అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment