life certificates
-
కస్టమర్‌కు అనుకూలంగా సేవలు ఉండాలి
ముంబై: బ్యాంకులు కస్టమర్‌కు ప్రాధాన్యం ఇస్తూ, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్బీఐకి ప్యానెల్ సిఫారసు చేసింది. మరణించిన ఖాతాదారు వారసులు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకునేందుకు అనుమతించాలని, కేంద్రీకృత కేవైసీ డేటాబేస్ తదితర సూచలను ప్యానెల్ చేసిన వాటిల్లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు సంబంధించి ఏ శాఖలో అయినా, ఏ నెలలో అయినా సమర్పించేందుకు అనుమతించాలని, దీనివల్ల రద్దీని నివారించొచ్చని పేర్కొంది. ఆర్బీఐ నియంత్రణలోని సంస్థల పరిధిలో వినియోగదారు సేవా ప్రమాణాల సమీక్షపై ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించింది. గతేడాది మే నెలలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో అద్యక్షతన ఈ కమిటీని నియమించడం గమనార్హం. సూచనలు.. ఇంటి రుణాన్ని తీర్చివేసిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తిరిగి రుణ గ్రహీతకు స్వాధీనం చేసే విషయంలో నిర్ధేశిత గడువు ఉండాలి. గడువులోగా ఇవ్వకపోతే బ్యాంక్/ఎన్బీఎఫ్సీపై జరిమానా విధించాలి. డాక్యుమెంట్లు నష్టపోతే, వాటిని తిరిగి పొందే విషయంలో బ్యాంకులు తమ వంతు సహకారం అందించాలి. ఇందుకు అయ్యే వ్యయాలను బ్యాంకులే పెట్టుకోవాలి. కస్టమర్లకు సంబంధించి రిస్క్ కేటగిరీలను సూచించింది. వేతన జీవులు అయితే వారికి వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, వారిని హై రిస్క్‌గా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొంది. విద్యార్థులను తక్కువ రిస్క్ వారిగా కేటాయించొచ్చని సూచించింది. కస్టమర్లతో వ్యవహారాలు నిర్వహించే సిబ్బంది, వారి పట్ల దురుసుగా వ్యవహరించకుండా నిర్ణీత కాలానికోసారి తప్పనిసరి శిక్షణ పొందాలని కూడా పేర్కొంది. -
EPFO: ఇక ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పీఫ్ ఆఫీస్‌లకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించలేని పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్‌ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది. -
పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!
కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ నేడు ప్రకటన చేసింది కేంద్రం. "వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కేసుల సంఖ్య పేరుగతున్న దృష్ట్యా వృద్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని సమర్పించడానికి ప్రస్తుతం ఉన్న 31.12.2021 కాలవ్యవధిని ఫిబ్రవరి 28, 2022 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు" పెన్షన్ల విభాగం పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక మెమోరాండంలో తెలిపింది. అప్పటి వరకూ వారి పెన్షన్ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొంది. వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్ సర్టిఫికెట్ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ తెలిస్తే కుర్రకారు ఫిదా కావాల్సిందే..!) -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్‌కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్‌వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి పెన్షనర్ల కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడంపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రపదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఖజానా శాఖ సంచాలకులు స్పష్టం చేయడంపై సంఘం ప్రధాన కార్యదర్శి టి.ఎం.బి. బుచ్చిరాజు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ పెన్షనర్లందరూ ఈ విషయాన్ని గుర్తించి తదనుగుణంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని కోరారు. -
పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: తమ లైఫ్ సర్టిఫికెట్లు అందజేసేందుకు ఈపీఎఫ్‌వో పెన్షనర్లు పీఎఫ్ కార్యాలయాలకు రావొద్దని, బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు/మీ సేవా కేంద్రాల వద్ద అందజేయొచ్చని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) పేర్కొంది. లేదా ఆధార్‌తో కూడుకున్న బయోమెట్రిక్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పింవచ్చని ఈపీఎఫ్‌వో తెలిపింది. సాధారణంగా ఏటా నవంబర్/డిసెంబర్లో పెన్షనర్లు పీఎఫ్ ఆఫీసుల్లో లైఫ్ సర్టిఫికెట్లు అందజేస్తుండగా, ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో పెన్షనర్లంతా ఇళ్ల వద్దే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డిజిటల్ జీవన్ ప్రమాణ్ సమర్పణకు అవసరమైన చర్యల కోసం కామన్ సర్వీసెస్ సెంటర్‌తో కలసి పనిచేస్తున్నట్లు ఈపీఎఫ్‌వో వివరించింది. చదవండి: క్వారంటైన్లో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సౌకర్యవంతంగా ఉండేలా సర్వీస్ డెలివరీ ఏజెన్సీని ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈపీఎస్ పెన్షనర్లు పొందేలా బహుళ సంస్థల ఏజెన్సీ (మల్టీ–ఏజెన్సీ) మోడల్‌ను ఈపీఎఫ్‌వో ఎంచుకున్నట్లు పేర్కొంది. దీనికోసం పెన్షనర్లు తమ మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్కు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని వివరించింది. స్థానిక పోస్ట్‌మాన్/సమీపంలోని పోస్టాఫీస్‌ను సంప్రదించడం లేదా ఉమాంగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో తమ చేతివేలిముద్ర స్కానింగ్‌ను పంపించడంతో సమర్పించవచ్చని పేర్కొంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా (కేవలం నవంబర్, డిసెంబర్లోనే కాకుండా) ఈపీఎస్ పెన్షనర్లు ‘డిజిటల్ జీవన్ ప్రమాణ్’ల సమర్పణకు కీలకమైన విధానమార్పును చేపట్టినట్లు తెలిపింది. ఈ విధంగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే తేదీ నుంచి ఏడాది పాటు అది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. చదవండి: ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం -
50లక్షల మంది పెన్షనర్లకు ఊరట!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నేపథ్యంలో దాదాపు 50 లక్షల మంది పెన్షనర్లకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఊరట కల్పించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ వద్ద సమర్పించాల్సిన జీవిత ధృవీకరణ పత్ర తుది గడువును జనవరి 15వరకు పొడిగించింది. ఈ మేరకు 120 మందికి పైగా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేశామని, 2017 జనవరి 15వరకు జీవిత ధృవీకరణ పత్రాల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్టు తెలిపినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఈ గడువును పొడిగిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ పెన్షనర్లు నవంబర్ వరకు తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. లేని పక్షంలో వారి పెన్షన్లను ఆగిపోనున్నాయి. కానీ ఈ తుది గడువును పెంచి ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఊరట కల్గించింది. కాగ ఈ జీవిత ధృవీకరణ పత్రాలను మొబైల్ ఫోన్ల జీవన్ ప్రమాణ్ సాప్ట్వేర్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ స్వీకరిస్తోంది. అదేవిధంగా ఈ పత్రాల సమర్పణకు రెండు లక్షల కామన్ సర్వీసు సెంటర్లను ఈపీఎఫ్ఓ ఏర్పాటుచేసింది.