‘పోలీస్‌ శాఖలో పదోన్నతులపై విచారణ జరిపించండి’ | Vijaya Sai Reddy Writes To Governor Over Police Department Promotions | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌ శాఖలో పదోన్నతులపై విచారణ జరిపించండి’

Published Thu, May 2 2019 8:00 PM | Last Updated on Thu, May 2 2019 8:05 PM

Vijaya Sai Reddy Writes To Governor Over Police Department Promotions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్దంగా పోలీస్‌ శాఖలో ఇచ్చిన పదోన్నతులపై విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. పదోన్నతుల విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి.. సీనియారిటీని తప్పుగా చూపించి అనుకూలమైన వారికి డీఎస్పీ నుంచి ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారని విజయసాయి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాలతోనే పదోన్నతులు ఇచ్చారని, గతంలో రూపొందించిన సీనియారిటీ జాబితాను డీజీపీ ఠాకుర్‌ పక్కన బెట్టారన్నాడు. డీఎస్పీల సీనియారిటీ విషయంలో ఐపీఎస్‌ కిషోర్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ ఓ జాబితాను రూపొందించిందని, కానీ డీజీపీ ఠాకుర్‌ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి, స్వలాభం కోసం ఆ జాబితాను పక్కనబెట్టి అనుకూలమైన వ్యక్తులకు పదోన్నతులు వచ్చేల చేశారన్నారు. ఈ పదోన్నతుల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement