పదోన్నతుల్లో 20 ఏళ్లుగా అవమానం
Published Wed, Oct 19 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
– జెడ్పీ ఏఓగా అవకాశం కల్పించాలని మహిళా ఎంపీడీఓలు ఆవేదన
కర్నూలు సిటీ: పంచాయతీరాజ్ శాఖలో 20 ఏళ్లుగా పదోన్నతులు, బదిలీలలో అవమానాలకు గురవుతున్నామని మహిళా ఎంపీడీఓలు మంగళవారం జెడ్పీ చైర్మెన్ మల్లెల రాజశేఖర్, సీఈఓ బీఆర్ ఈశ్వర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు జెడ్పీ ఏఓగా పని చేసిన భాస్కర్ నాయుడు ఇటీవల నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై బదిలీ కాగా ఆయన స్థానంలో ఆలూరు ఎంపీడీఓ మధు భూషణ్‌రావుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ నియమాకంపై మహిళా ఎంపీడీఓలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 1996లో నేరుగా నియామకమైన ఎంపీడీఓలను వదిలేసి ఈఓఆర్డీ నుంచి ఎంపీడీఓగా పదోన్నతిపై పొందిన వారిని ఏఓగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. సీనియార్టీ జాబితా తయారు చేయడంలో చోటుచేసుకున్న అవకతవకలతో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారమే ఏఓను నియమించామని చైర్మెన్ తెలిపారు. మరోసారి పీఆర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి క్లారిటీ తీసుకుని అర్హులకు న్యాయం చేస్తామని హామినిచ్చారు. చైర్మెన్, సీఈఓను కలిసిన వారిలో ఎంపీడీఓలు వరలక్ష్మి, సువర్ణలత, క్యాథరిన్, విజయలక్ష్మి, మల్లేశ్వరి ఉన్నారు.
Advertisement