కోల్‌కతా: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి సుబ్రతా ముఖర్జీ (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. వారం రోజుల క్రితం శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణవార్త విన్న వెంటనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మమత మంత్రి వర్గంలో ఆయన కీలక మంత్రిగా పనిచేశారు. పంచాయతీరాజ్ శాఖ సహా పలు ఇతర శాఖలను బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఆయన మరణం పట్ల మమత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముఖర్జీ మరణం తమకు తీరని లోటని మమతా బెనర్జీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment