
నటీమణులు చిత్రాలు చేసినా, చేయకపోయినా ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటారు. సంచలన నటి నయనతార వంటి వారైతే ఇక చెప్పనవసరం లేదు. పాత్రికేయుల దృష్టి నుంచి ఇలాంటివారు తప్పించుకోలేరు. ఇక అసలు విషయానికి వస్తే నటుడు విశాల్ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం 'మార్క్ ఆంటోని'. నటి ప్రీతివర్మ నాయకిగా నటించిన ఇందులో ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు.
దర్శకుడు సెల్వరాఘవన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్‌కుమార్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వినాయకచవితికి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ 'విమి' విషాద గాథ.. భర్తను కాదని ఆపై ప్రేమికుడి వల్ల వ్యభిచారం)
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న విశాల్‌ను నయనతార చిత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న పోవడానికి కారణం ఏంటన్న విలేకరి ప్రశ్నకు ఆయన బదులిస్తూ నయనతార ఏ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని అది ఆమె వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. కచ్చితంగా పాల్గొనాలని ఆమెను నిర్బంధం చేయలేమన్నారు. తనకు ఇష్టం లేదని చెబితే ఆమెను మనం ఏమి చేయలేమన్నారు. అయితే ఆమె వస్తే బాగుంటుందన్నారు. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పేమి కాదని విశాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment