నేనందుకే ప్రమోషన్స్‌కి రాను! | nayanthara Reveals Why She Not Attend Promotion | Sakshi
Sakshi News home page

నేనందుకే రాను!

Published Sun, Oct 6 2019 8:53 AM | Last Updated on Sun, Oct 6 2019 9:24 AM

nayanthara Reveals Why She Not Attend Promotion - Sakshi

సినిమా: లేడీ సూపర్‌స్టార్‌. అభిమానులు నయనతారకిచ్చిన పట్టం ఇది. అందుకు తగ్గట్టుగానే ఈ సంచలన నటి తన స్టార్‌డంను పెంచుకుంటూపోతోంది. ఆదిలో నయనతారకు గ్లామర్‌ పాత్రలే తలుపు తట్టేవి. ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వరిస్తున్నాయి. ఇకపోతే ఈ అమ్మడిపై వచ్చినన్ని వదంతులు, తను ఎదురొడ్డిన ఎదురీతలు చాలానే. ముఖ్యంగా వ్యక్తిగతంగానే పలు విమర్శలను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి నయనతార తన చిత్రాల ప్రారంభోత్సవాల్లోనూ, చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనదనేది. నిజమే ఈ అమ్మడు తను నటించిన ఏ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలకు రాదు. అది ఎంత పెద్ద చిత్రం అయినా, చివరికి సొంత చిత్రం అయినా కావచ్చు. అలాంటిది ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననుందనే ప్రచారం జరిగింది. అదేకాదు, తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రచార కార్యక్రమానికి యథాతథంగా నయనతార డుమ్మా కొట్టింది. అంత వరకూ ఎందుకు తాను తన ప్రియుడిని నిర్మాతగా చేస్తూ నిర్మిస్తున్న నెట్రికన్‌ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా రాలేదు.

దీంతో తన చిత్ర ప్రారంభోత్సవానికి రాకపోవడం ఏమిటీ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు విషయాన్ని నయనతార తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధ పడిందట. తాను ఏ చిత్ర  ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆ చిత్రాలు బాగా ఆడలేదని చెప్పింది. ఆ సెంటిమెంట్‌ కారణంగానే తానీ చిత్ర ప్రారంభోత్సవాల్లోనూ, ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదని అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో నయనతార కూడా ఇంత సెంటిమెంటల్‌ ఉమెన్‌నా అంటూ చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. ఇదిలాఉండగా, నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ సంచలన జంట చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇదీ బహిరంగమే. అయితే ఇటీవల నయనతార, విఘ్నేశ్‌శివన్‌ పెళ్లికి సిద్ధం అయ్యారని, వీరి పెళ్లి తేదీ కూడా ఖరారైట్లు, డిసెంబర్‌ 25న ముహూర్తం, విదేశంలో వివాహతంతు ఇలాంటి ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టే విధంగా నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ ఒక ప్రకటనను తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందులో ఎవరేమైనా రాసుకోండి. దాని గురించి మాకు బాధ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. అసలు ఆ విషయం గురించి వివరించడం కుదరదని పేర్కొన్నాడు. మరి ఇకనైనా ఈ జంట గురించి వదంతులు ఆగుతాయో లేదో చూడాలి.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement