ఎట్టకేలకు తెరదించారు
► 195 మందికి డీఎస్పీలుగా పదోన్నతి!
హైదరాబాద్: డీఎస్పీ పదోన్నతుల వ్యవహారం చివరి మజిలీకి చేరింది. మూడే ళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారానికి ఎట్టకే లకు హోంమంత్రి, ఉన్నతాధికారులు ఆది వారం తెరదించారు. హోంమంత్రి అధ్యక్షతన శనివారం అర్ధరాత్రి వరకు ఈ పదోన్నతులపై సమావేశం జరిగింది. అభ్యంతరాలు తెలుపు తున్న ఇన్‌స్పెక్టర్లు, పదోన్నతి పొందుతున్న ఇన్‌స్పెక్టర్ల మధ్య రాజీ కుదిర్చి ఆదివారం డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీ (డీపీసీ) సమావేశానికి తెరదించింది.
195 మందికి గ్రీన్‌సిగ్నల్..
వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్.. ఈ మూ డు ప్రాంతాల్లో అర్హత కలిగిన అధికారుల పదో న్నతి జాబితా రెండు నెలల కిందే డీజీపీ కార్యాలయం విచారణ నిమిత్తం ఏసీబీ తో పాటు అన్ని యూనిట్లకు వెళ్లింది. 1989, 1991, 1995 బ్యాచ్‌లకు చెందిన 460 మంది ఇన్‌స్పెక్టర్ల జాబితాపై ఆదివారం డీజీపీ కార్యా లయం లో డీపీసీ కసరత్తు చేసింది. ప్రతి అధికారికి సంబంధించిన ఏసీఆర్ (యాన్యు వల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్), పెండింగ్‌లో ఉన్న పనిష్మెంట్లు, విచారణలు.. ఇలా అన్నిం టిని సమీక్షించి 195 మంది ఇన్‌స్పె క్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమా చారం. 1989, 1991 బ్యాచ్ అధికారులు 131 మందితో పాటు 1995 బ్యాచ్‌కు చెంది న 64 మంది ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించే అవకాశం ఉందని సీనియర్ ఐపీఎస్ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
సీఎం వచ్చాకే పోస్టింగ్స్
పదోన్నతుల పొందిన అధికారుల జాబితా సీఎం పరిశీలించాక అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం సీఎంకేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, ఆయన రాగానే అధికారిక జాబితాతో పాటు పోస్టింగ్స్ ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.