కోవిడ్-19 రాకతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి మార్పులు చోటుచోసుకోలేదు. ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు సర్దుమనగడంతో ఆయా రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. కాగా ఈ ఏడాదిలో వేతన జీవుల శాలరీలు బాగా పెరుగుతాయని జాబ్స్ అండ్ రిక్రూటింగ్ ఎజెన్సీ మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. కోవిడ్-19 ముందు ఇచ్చిన శాలరీ హైక్ కంటే ఈ ఏడాది ఎక్కువ ఇవ్వాలని కంపెనీలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
9 శాతం మేర జీతాల పెంపు..!
కరోనా సంక్షోభం నుంచి ఆయా రంగాలు గణనీయంగా పుంజుకోవడం... మార్కెట్‌లో టాలెంట్ ఉన్నవాళ్లు తక్కువగా ఉండడంతో ఉద్యోగుల జీతాలను భారీగా పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు మైకేల పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ ఏడాది దేశంలోని కంపెనీలు సగటున 9 శాతం మేర జీతాలను పెంచేందుకు సిద్దంగా ఉన్నాయని వెల్లడించింది. ఆయా కంపెనీల్లో నిర్వహించిన సర్వే ప్రకారం జీతాల పెంపు నివేదికను మైకేల్ పేజ్ ఇండియా రూపోందించింది. ఈ సర్వేలో 13 మేజర్ సెక్టార్లకు చెందిన 500 కంపెనీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.
వీరికి భారీగా పెరగనున్న జీతాలు
అట్రిషన్ రేటు కూడా జీతాల పెంపుకు దారితీసిందని మైకేల్‌పేజ్ తన నివేదికలో వెల్లడించింది. ఐటీ, ఐటీ సంబంధిత సెక్టార్, మాన్యుఫాక్చరింగ్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్, రిటైల్, గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ (జీఐసీ), ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్‌ఎస్‌ఐ) సెక్టార్లలోని పెద్ద కంపెనీలు ఈ ఏడాది సగటున 8–12 శాతం శాలరీ హైక్‌ను చేపట్టనున్నాయని మైకల్ పేజ్ ఇండియా శాలరీ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఫిన్‌టెక్, కన్జూమర్ టెక్, బీ2బీ, హెల్త్‌టెక్, క్రిప్టో, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) రంగాల్లోని స్టార్టప్‌లు శాలరీలను ఎక్కువగా పెంచాలని చూస్తున్నాయని అన్నారు.
స్టార్టప్స్‌లో భారీగా పెంపు..!
స్టార్టప్‌లు, యూనికార్న్‌లు, త్వరలో యూనికార్న్‌లుగా మారబోయే కంపెనీలు ఉద్యోగులకు భారీ వేతన పెంపును అందిస్తాయని మైకేల్ పేజ్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. ఆయా కంపెనీల ఉద్యోగులకు సగటున 12 శాతం మేర జీతాలను పెంచనున్నాయి. గత రెండేళ్ల కంటే ఈ సారి శాలరీ హైక్ ఎక్కువగా ఉంటుందని, కరోనా ముందు లెవెల్స్‌ను దాటుతుందని మైకల్ పేజ్ ఇండియా ఎండీ అంకిత్ అగర్వాల్ వెల్లడించారు.
చదవండి: పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై ఐఎంఎఫ్ ప్రశంసలు..!
Comments
Please login to add a commentAdd a comment