
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రో ఉద్యోగులకు తీపి కబురు అందించింది.విప్రోయిట్‌ల వార్షిక జీతాల పెంపును తాజాగా ప్రకటించింది. 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్స్ ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల జీతంతో దీన్ని ఉద్యోగులకు అందించనుంది. ఈమేరకు ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించింది. ఈ రౌండ్ వార్షిక ఇంక్రిమెంట్లు లేదా మెరిట్ జీతాల పెంపుదల (MSI) ప్రయోజనాలను దాదాపు 96 శాతం మంది ఉద్యోగులకుఅందించనుంది.
(వాళ్లంతా అలా వచ్చినవారేగా! మూన్ లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు)
గత త్రైమాసికంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, తాము గణనీయమైన విస్తృత కవరేజీని, మార్కెట్‌తో సమానంగా జీతం పెరుగుదలను అందిస్తున్నామని కంపెనీ హెచ్‌ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఇమెయిల్ ద్వారా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ జీతం పెరుగుదలకు సంబంధించిన లేఖలను ఆయా ఉద్యోగులకు అందిస్తామని తెలిపారు. అలాగే జీతం పెరుగుదల పనితీరు అర్హత ప్రమాణాల ఆధారంగా 96 శాతం మంది ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు.
(మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు)