2024 ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. టెక్ పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం విప్రో వందలాదిమందిని తొలగించడానికి సిద్ధమైంది. సంస్థ లాభాల మార్జిన్‌లను మెరుగుపరచుకోవాలనుకుంటున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విప్రో కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపడుతోంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు సైతం ఖర్చులను ఆదా చేయడానికి లేఆప్స్ ప్రక్రియను మొదలుపెట్టాయి. విప్రో కంపెనీ కూడా ఈ సంస్థలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇటీవల వెల్లడైన క్యూ3 ఫలితాలలో విప్రో ఆశించిన లాభాలను పొందలేకపోయింది. ఫలితాల ప్రకారం విప్రో లాభం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువ. కాబట్టి కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉద్యోగులను తొలగించడానికి సంకల్పించింది.
ఇదీ చదవండి: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..
ప్రస్తుతం విప్రో కంపెనీ లాభాలు పొందే దిశగా అడుగులు వేస్తోంది. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'అపర్ణ అయ్యర్' రాబోయే త్రైమాసికంలో కంపెనీ లాభాల మార్జిన్‌లను మెరుగుపరిచే బాధ్యతను తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకుంది. సంస్థ తొలగించనున్న ఉద్యోగులలో ఆన్‌సైట్‌లో పని చేసే మధ్య స్థాయి ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment