ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది.
"ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.
గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment