Rishad Premji
-
ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!
వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై చివరి వరకు నాది అదే మాట అంటూ ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వార్తల్లో నిలచిని సంగతి తెలిసిందే. తనకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై నమ్మకం లేదని వారానికి 70 గంటలు యువత పనిచేయాల్సిందేనని అన్నారు. అప్పుడే భారతదేశం అభివృధ్దిచెందుతుంది అంటూ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కొందరూ సీఈవోలు ఆయన మాటకు మొగ్గుచూపగా కొందరూ ఉద్యోగులు, టెక్కీలు మాత్రం ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బెంగళూరు టెక్ సదస్సు 2024లో ఇదే అంశంపై అత్యంత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఏ సంస్థం ఇలాంటి ఆఫర్ ఇవ్వదంటూ సరొకత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది సదరు ఉద్యోగి బాధ్యతే అంటూ కౌంటరిస్తూ మాట్లాడారు. ఇంతకీ రిషద్ ప్రేమ్‌జీ ఏమన్నారంటే.."పని-జీవిత సమతుల్యత"ను ఎవరికి వారుగా నిర్వచించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో వెసులబాటు అందిస్తామని ఏ సంస్థలు లేదా కార్యాలయాలు ఉద్యోగికి ఆఫర్లు ఇవ్వవు. అదంతా మన చేతిలోనే ఉంది." అని అటున్నారు రిషద్. తాను ఈ విషయాన్ని కరోనా ప్రారంభ సమయంలోనే తెలుసుకున్నానని అన్నారు. ఈ విషయమై చాలామంది ఉద్యోగులు కంపెనీలపై ఆరోపణలు చేస్తుంటారు. అది సబబు కాదని అన్నారు. నీ సీనియర్ ఉద్యోగులు లేదా పై అధికారులు అదనపు భారం లేదా భాద్యతలు మోపితే దాన్ని సదరు ఉద్యోగే వారితో మాట్లాడి చాకచక్యంగా పని భారం తగ్గించుకునే యత్నం చేయాలి. నీ వర్క్ విషయంలో నీకంటూ ఓ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని అధిగమించేలా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సంస్థకు లేదా పై అధికారులకు వాస్తవాన్ని వివరించి తెలివిగా పనిని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటున్నారు. చాలావరకు ఉద్యోగుల నుంచి వచ్చే మొదటి ఫిర్యాదు పని ఒత్తిడి..అస్సలు దీని గురించి మీ టీమ్ ఇన్ఛార్జ్, లేదా సూపర్వైజర్తో చర్చింకుండా మౌనంగా అన్నిటికి తలాడిస్తూ..కోరి మరీ పని ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారని రిషద్ ఆరోపించారు. ఏ సంస్థ కూడా ఉద్యోగిని బొట్టు పెట్టి మరీ వర్క్లైప్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యమని చెప్పదు. దాన్ని ప్రతి ఉద్యోగి తనంతటా తానుగా నిర్వహించుకోవాల్సిన సున్నితమైన అంశం. అంతేగాదు పై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని పని సమతుల్యతను అందించేలా వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అప్పుడే సంస్థ ఉద్యోగి ఒత్తిడులు, టెన్షన్లు, పని సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకుని వెసులుబాటు కల్పించగలిగే అవకాశం ఉంటుందంటున్నారు రిషద్. అంతేగాదు ఈ వర్క్ లైప్ బ్యాలెన్స్ అనేది ముమ్మాటికీ ఎవరికి వారుగా నిర్వహించుకోవాల్సిన విషయం అని బెంగళూరు టెక్ సదస్సులో రిషద్ గట్టిగా నొక్కి చెప్పారు. (చదవండి: పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!) -
అలాంటి ఉద్యోగుల విషయంలో కఠిన వైఖరి
ఉద్యోగుల కాంట్రాక్టు విషయంలో తన కఠిన వైఖరిని ఐటీ సంస్థ విప్రో స్పష్టం చేసింది. తమ ఉద్యోగులతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాలకు కట్టుబడి ఉంటామని విప్రో తెలిపింది. అంటే కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి బయటకు వెళ్లిపోయేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేసింది."ఉద్యోగులు, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల విషయంలో ఖచ్చితంగా ఉంటాం. ఇందులో మా వైఖరి మారలేదు. మారబోదు’’ అని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సంస్థ వార్షిక సాధారణ సమావేశంలో అన్నారు. కంపెనీలో ప్రతి ఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తున్నామని, కానీ కొంత మంది బయట మంచి అవకాశాలు దొరికితే వెళ్లిపోతున్నారని ఆయన చెప్పారు.గత ఏడాది నవంబర్‌లో విప్రోను వీడి కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరిన తమ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ నుంచి కాంట్రాక్టు ఉల్లంఘన కింద విప్రో ఇటీవల రూ.25 కోట్లు కోరింది. 2015లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినప్పటి నుంచి దలాల్‌కు మంజూరు చేసిన స్టాక్ యూనిట్ల విలువను బట్టి ఈ మొత్తాన్ని విప్రో డిమాండ్ చేసింది. ఇదే వ్యవహారంలో తన మాజీ యజమాని విప్రోతో వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇటీవల కాగ్నిజెంట్ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. -
మాజీ ఉద్యోగులపై కోర్టు మెట్లెక్కిన విప్రో..రిషద్ ఆసక్తికర వ్యాఖ్యలు
విప్రో మాజీ ఉన్నతస్థాయి ఉద్యోగుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందించారు. మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రో ఉద్యోగులు వారు చేస్తున్న పనిలో గోప్యత పాటించడం అవసరం. ఆ గోప్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలకు తావులేదని చెప్పారు. మా ఉద్దేశం అదికాదు.. వేరే ఉంది వ్యాజ్యాలు ఉద్యోగుల ఉపాధిపై దెబ్బకొట్టేందుకు కాదని, కేవలం వారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నవంబర్‌లో, విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన జతిన్ దలాల్‌పై దావా వేసింది. అతను విప్రోలో సీఎఫ్ఓగా పనిచేసిన వెనువెంటనే కాగ్నిజెంట్‌లో సీఎఫ్ఓగా చేరారు. తద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించింది. అందరిది ఒకే మాట క్యూ3 ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్‌జీ సీఈఓ థియరీ డెలాపోర్టే గతంలో ప్రస్తావించిన అంశంపై మాట్లాడారు. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్‌పై వ్యాజ్యాలు దాఖలు చేయడం కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘించినందుకే తప్పా ఇందులో వ్యక్తిగత అంశాలకు చోటులేదని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిషద్ ప్రస్తావించారు. -
విప్రో చైర్మన్ కీలక నిర్ణయం, సగం జీతం కట్
సాక్షి, ముంబై: విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది తన వేతనాన్ని సగానికి తగ్గించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున లేఆఫ్స్‌కు మొగ్గు చూపుతున్నతరుణంలో విప్రో రిషద్ ప్రేమ్‌జీ వేతన కోత నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) యుఎస్‌లోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం రిషద్ ప్రేమ్‌జీ 2023 ఆర్థిక సంవత్సరానికి తన జీతంలో స్వచ్ఛందంగా 50 శాతం కోత విధించుకున్నారు. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి మొత్తం వార్షిక పరిహారంగా 951,353 డాలర్లు పొందగా , మునుపటి సంవత్సరం ఆదాయంతో పోలిస్తే దాదాపు 50 శాతం తక్కువ. విప్రో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ప్రేమ్‌జీ ప్రస్తుత 5 సంవత్సరాల పదవీకాలం జూలై 30, 2024న ముగియనుంది. ఇదీ చదవండి: యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..! ఇలాంటి మరెన్సీ కార్పొరేట్ వార్తలు, విశేషాలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఆఫీసుల నుంచే విధులు: విప్రో
ముంబై: మరింతమంది ఉద్యోగులు ఇళ్ల నుంచి కాకుండా కార్యాలయాల నుంచి పనిచేయవలసి ఉంటుందని సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా పేర్కొన్నారు. కార్యాలయాలకు రావడం ద్వారా సిబ్బంది మధ్య దగ్గరతనం ఏర్పడుతుందని, సంబంధాలు మెరుగుపడతాయని తెలియజేశారు. మానవులకు ఇవి కీలకమని, ఇందుకు ఎలాంటి టెక్నాలజీ దోహదం చేయదని స్పష్టం చేశారు. 2023 ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో ప్రసంగిస్తూ రిషద్ ఎంతటి ఆధునిక టెక్నాలజీ అయినా మానవ సంబంధాలను నిర్మించలేదని వ్యాఖ్యానించారు. తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్న సిద్ధాంతాన్ని తాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అటు ఆఫీసులు, ఇటు ఇళ్లవద్ద నుంచి పనిచేసే హైబ్రిడ్ వర్కింగే భవిష్యత్ విధానమని ఆయన తెలిపారు. టెక్నాలజీ రంగంలోనే ఇలాంటి విధానాలు వీలవుతాయని రిషద్ చెప్పారు. అయితే, ఉద్యోగులు ఇంటి నుంచే కాకుండా.. కార్యాలయాలకు సైతం వచ్చి పనిచేయడానికి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసినప్పటికీ గత రెండేళ్లలో ఉద్యోగవలస భారీగా పెరిగిపోయిందని రిషద్ పేర్కొన్నారు. దీంతో 60 శాతం మంది ఉద్యోగులు కొత్తగా చేరినవారేనని వెల్లడించారు. వెరసి వీరంతా ఆర్గనైజేషన్ సంస్కృతిని తెలుసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్‌గా పనిచేస్తూనే ఏఐఆర్‌లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్‌గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్‌లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్‌లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్‌లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్‌లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్‌లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్లో మూన్‌లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారనే కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో తమ సంస్థకు చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటీవ్‌ను ఫైర్ చేసినట్లు విప్రో ఛైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ బహిర్ఘతం చేశారు. బెంగళూరు కేంద్రంగా జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ కన్క్లేవ్ కార్యక్రమంలో రషీద్ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రోలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్ - 20 ఎగ్జిక్యూటీవ్‌లలో ఓ ఉద్యోగి సంస్థ మోరల్స్‌ను ఉల్లంఘించారు. సంస్థకు అతని అవసరం ఎంటో బాగా తెలుసు. కానీ కొన్నిసమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేం (రషీద్ ప్రేమ్‌జీ) అదే చేశాం. కేవలం పదే పది నిమిషాల్లో అతన్ని విధుల నుంచి ఫైర్ చేసినట్లు చెప్పారు. సదరు సీనియర్ ఉద్యోగి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేదంటే ఇంకేదైనా కారణంతో సంస్థ నుంచి బయటకు పంపారనే విషయంపై విప్రో ఛైర్మన్ వెల్లడించలేదు. అయితే విప్రోకు మోరల్స్ ఉన్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించినా, లేదంటే వేధింపులకు పాల్పడితే ఎవరి ఉద్యోగం ఉండదు. అంతెందుకు నేను ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా విప్రోలో నా ఉద్యోగం కూడా ఉండదని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు సెప్టెంబర్ 21 న, ప్రేమ్‌జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్రోలో మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తున్న మొత్తం 300 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. "వాస్తవం ఏంటంటే ఈ రోజు విప్రో కోసం పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఆ ఉద్యోగులే కాంపిటీటర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో 300మందిని గుర్తించి ఇంటికి పంపించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
విప్రో లాభం 9% డౌన్
న్యూఢిల్లీ: సిబ్బంది ఖర్చులు పెరగడం, అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయాలు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ సేవల సంస్థ విప్రో నికర లాభం 9.3% క్షీణించింది. రూ. 2,659 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ. 2,930 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం సుమారు 15% పెరిగి రూ. 19,667 కోట్ల నుంచి రూ. 22,540 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా లాభం సుమారు 4%, ఆదాయం 5% వృద్ధి చెందాయి. ‘ఆర్డర్లు, భారీ డీల్స్, ఆదాయాల్లో పటిష్టమైన వృద్ధి సాధించడం.. మార్కెట్లో మా పోటీతత్వం మెరుగుపడటాన్ని సూచిస్తోంది‘ అని కంపెనీ సీఈవో థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. వివాదాస్పదమైన మూన్‌లైటింగ్‌పై (రెండు సంస్థల్లో ఉద్యోగాలు చేయడం) స్పందిస్తూ ఇది న్యాయపరమైన అంశం కంటే నైతిక విలువలకు సంబంధించిందని డెలాపోర్ట్ పేర్కొన్నారు. ఉద్యోగులు చిన్నా చితకా ఇతరత్రా పనులు చేసుకోవడం ఫర్వాలేదని కానీ ఏకంగా పోటీ కంపెనీకి పని చేయడం మాత్రం నైతికత కాదని ఆయన స్పష్టం చేశారు. మూన్‌లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను తొలగించామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో డెలాపోర్ట్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇతర విశేషాలు.. ► ఆర్డరు బుకింగ్‌లు 23.8 శాతం, భారీ డీల్స్ 42 శాతం పెరిగాయి. క్యూ2లో 725 మిలియన్ డాలర్ల విలువ చేసే 11 భారీ డీల్స్ కుదిరాయి. ► సమీక్షాకాలంలో విప్రో 10,000 మంది ఉద్యోగులను ప్రమోట్ చేసింది. అట్రిషన్ రేటు వరుసగా మూడో త్రైమాసికంలోనూ తగ్గింది. క్యూ1లో 23.3 శాతంగా ఉన్న ఈ రేటు స్వల్పంగా 23 శాతానికి దిగి వచ్చింది. ► సెప్టెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్య నికరంగా కేవలం 605 పెరిగి 2,59,179కి చేరింది. తాజాగా 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. బుధవారం బీఎస్ఈలో విప్రో షేరు సుమారు 1% లాభంతో రూ. 407.75 వద్ద క్లోజయ్యింది. -
మూన్‌లైటింగ్: 300 విప్రో ఉద్యోగులపై వేటు, ఐటీ ఉద్యోగుల్లో వణుకు
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో మూన్‌లైటింగ్ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఇప్పటికే కొన్ని దిగ్గజ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కోవలో దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో ముందు వరసలో నిలిచింది. తాజాగా 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ విషయాన్ని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బుధవారం స్వయంగా వెల్లడించారు. తమ కంపెనీలో పనిచేసే 300మంది అదే సమయంలో తన పోటీదారుల కోసం పనిచేస్తున్నట్లు గుర్తించామని రిషద్ ప్రేమ్‌జీ ప్రకటించారు. మూన్‌లైటింగ్ విధానం కంపెనీ నిబంధనలను, పూర్తిగా ఉల్లంఘించడమే అని మరోసారి గట్టిగా వాదించారు. AIMA ఈవెంట్లో మాట్లాడుతూ, మూన్‌లైటింగ్ (ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం) గురించి తీవ్రంగా విమర్శించిన ప్రేమ్‌జీ అటువంటి ఉద్యోగులకు కంపెనీలో చోటు లేదని స్పష్టం చేశారు. విప్రోతో కలిసి పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థుల కోసం ఏకకాలంలో నేరుగా పని చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాగా మూన్‌లైటింగ్ విధానం అనైతికమని, నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులను ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంతో ఇప్పటివరకూ లైట్ తీసుకున్న పలు ఐటీ సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. -
వారంలో రెండు రోజులు ఆఫీస్..!
బెంగళూరు: ప్రముఖ ఐటి సంస్థ విప్రో ఉద్యోగులను రేపటి నుంచి కార్యాలయాలకు తిరిగి రావాలని కోరింది. ఉద్యోగులు ప్రస్తుతం వారానికి రెండు రోజులు కార్యాలయం నుంచి పని చేస్తారు అని పేర్కొంది. విప్రో ఛైర్మన్ రిషాద్ ప్రేమ్ జీ ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఇలా ట్వీట్ చేశారు... "18 నెలల సుదీర్ఘ కాలం తర్వాత, మా నాయకులు @Wipro రేపు(వారానికి రెండుసార్లు) కార్యాలయానికి తిరిగి వస్తున్నారు. పూర్తిగా వ్యాక్సిన్ ఇచ్చాము, అందరూ కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు" అని అన్నారు. (చదవండి: జుకర్‌బర్గ్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు) విప్రో కార్యాలయంలో ప్రవేశించేటప్పుడు ఉష్ణోగ్రత తనిఖీలు, క్యూఆర్ కోడ్ స్కాన్లతో సహా కోవిడ్-19 సంబంధిత భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఒక వీడియోను ఆయన షేర్ చేశారు. జూలై 14న జరిగిన కంపెనీ 75వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రేమ్ జీ భారతదేశంలోని ఉద్యోగులలో 55 శాతం మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. విప్రోలో ప్రస్తుతం సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచ శ్రామిక శక్తిలో మూడు శాతం కంటే తక్కువ మంది కార్యాలయం నుంచి పనిచేస్తున్నారని ప్రేమ్ జీ పేర్కొన్నారు. After 18 long months, our leaders @Wipro are coming back to the office starting tomorrow (twice a week). All fully vaccinated, all ready to go - safely and socially distanced! We will watch this closely. pic.twitter.com/U8YDs2Rsyo — Rishad Premji (@RishadPremji) September 12, 2021 -
విప్రో కొత్త సారథిగా థియెరీ డెలాపోర్ట్
న్యూఢిల్లీ: కొంత కాలంగా వృద్ధి పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఐటీ రంగ దిగ్గజం విప్రో కొత్త సారథిని ఎంపిక చేసుకుంది. క్యాప్‌జెమినీలో సుదీర్ఘకాలం పనిచేసిన థియెరీ డెలాపోర్ట్.. నూతన సీఈవో, ఎండీగా జూన్ 6 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని విప్రో నుంచి శుక్రవారం ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అబిదాలి జెడ్ నీముచ్వాలా జూన్ 1న తప్పుకోనున్నారు. అప్పటి నుంచి డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టే వరకు రోజువారీ కార్యకలాపాలను చైర్మన్ రిషద్ప్రేమ్జీ చూస్తారని విప్రో తెలిపింది. పోటీ సంస్థ ఇన్ఫోసిస్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న సలీల్ పరేఖ్ కూడా అంతకుపూర్వం క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ కావడం గమనార్హం. పోటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌తో పోల్చుకుంటే విప్రో వృద్ధి పరంగా వెనకబడిన తరుణంలో ఈ నూతన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో
సాక్షి, ముంబై: కరోనా పై పోరులో ఇప్పటికే పెద్ద మనసు చాటుకున్న ఐటీ సేవల సంస్థ విప్రో తన సేవలను కొనసాగిస్తోంది. తమ సంస్థ ప్రతిరోజు 20 లక్షలకు పైగా ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేసిందని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కష్టాలు పడుతున్న ప్రజలకు ఇతర సంస్థల సహాయక చర్యలను ఆయన ప్రశంసించారు. మహమ్మారితో పోరాడుతున్న దేశానికి అందరూ సహాయ, సహకారాలు అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ఇప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి వారందరికీ నమస్కరిస్తున్నాను. ఈ అవసరం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నందున దయచేసి అందరూ చేయగలిగినదంతా చేయాలని ఆయన కోరారు. విప్రో క్యాంపస్ క్యాంటీన్ల ద్వారా 14-21 రోజులుగా రోజూ 60 వేలకు పైగా ప్రజలకు తాజాగా వండిన భోజనాన్ని, పూర్తిస్థాయి రేషన్ సరుకులను అందజేశామని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఏప్రిల్ 6 న ట్విటర్లో తెలిపారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని ప్రకటించారు. ఈ మాటను నిలబెట్టుకున్న ఫౌండేషన్ తాజాగా రోజుకు 20 లక్షల మందికి పైగా ఆహారం సరఫరా చేస్తుండటం ప్రశంసనీయం. (విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు) కాగా కోవిడ్-19 తో పోరాడటానికి అజీమ్ ప్రేమ్‌జీ యాజమాన్యంలోని విప్రో ఎంటర్ప్రైజెస్ అండ్ ఫౌండేషన్ రూ.1125 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షల మధ్య ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పలు కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వ్యాపారవేత్తలు కూడా తమ వంతు సాయం అందిస్తున్నాయి. టాటా గ్రూప్ మొత్తం రూ .1,500 కోట్లను ప్రకటించింది. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లకు పైగా చెల్లిస్తున్నట్లు తెలపింది. అలాగే ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్రా విరాళంతో పాటు, తమ కర్మాగారాల్లోని క్యాంటీన్లలో అరటి ఆకులను ప్లేట్లుగా ఉపయోగించడం ద్వారా అరటి రైతులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. We are now supporting food for over 20 lakh people everyday. There are many organisations enabling this effort giving it everything they have. I salute them all. Please do all that you can to help as the need is still much much greater. @Wipro @azimpremjiuniv — Rishad Premji (@RishadPremji) April 19, 2020 -
విప్రోకు అబిదాలి నీమూచ్‌వాలా గుడ్‌బై
సాక్షి, బెంగళూరు: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో సంస్థ సీఈవో, ఎండీ అబిదాలి జెడ్ నీమూచ్‌వాలా తన పదవులకు రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో సంస్థ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన సీఈవో నియామకం జరిగే వరకూ అబిదాలి సీఈవోగా కొనసాగనున్నారు. ‘75 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగిన విప్రో సంస్థకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని అబిదాలి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. (విప్రో లాభం రూ.2,456 కోట్లు) కాగా మాజీ టీసీఎస్ సీనియర్ ఉద్యోగి అయిన నీముచ్వాలా 2015 ఏప్రిల్1న విప్రో సీవోవోగా ఆ తర్వాత ఏడాది సీఈవోగా నియమితులయ్యారు. ఇక అబిదాలి రాజీనామాపై విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందిస్తూ ‘అబిద్’ విప్రోకు చేసిన కృషికి కృతజ్ఞతలు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
రిషద్ ప్రేమ్‌జీకి పదవీ గండం?!
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ త్వరలోనే తన పదవిని కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సెబీ (స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ) నియమాల ప్రకారం..ప్రధమ శ్రేణి (5000 కంపెనీల) చైర్మన్, సీఈవోలు వేరు వేరు వ్యక్తులు ఉండాలన్న నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. విప్రో మాత్రం రిషద్‌నే కొనసాగించాలని సెబీని కోరనుంది. సెబీ కొత్త నియమాల ప్రకారం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌నే బోర్డు చైర్‌పర్సన్‌గా నియమించాలి. మరోవైపు ప్రాక్సీ అడ్వైజరీ సర్వీసస్ ఎండీ శ్రీరాం సుబ్రహ్మణియన్ స్పందిస్తూ..రిషద్‌కు రెండు ప్రత్యామ్నాలున్నాయని..ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిని వదులుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, జాయింట్ ఎండీ పదవులను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. తాజా సెబీ నిమయాల ప్రకారం ప్రమోటర్లకు 74 శాతం షేర్లు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోలేరు. కాగా విప్రో షేర్స్‌ను అజీమ్ ప్రేమ్‌జీ పౌండేషన్‌కు ఇచ్చినప్పటికి.. ఓటింగ్ హక్కులు కలిగి ఉంటారని కంపెనీలు వర్గాలు తెలిపాయి. మరోవైపు గత సంవత్సరం రిషద్ తండ్రి అజీమ్ ప్రేమ్ జీ తప్పుకోవడంతో రిషద్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. చదవండి: విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!! -
విప్రో ప్రేమ్‌జీ రిటైర్మెంట్!!
న్యూఢిల్లీ: చిన్న స్థాయి వంట నూనెల సంస్థను దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన ఐటీ దిగ్గజం, విప్రో వ్యవస్థాపకుడు అజీం హెచ్ ప్రేమ్‌జీ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ చేతికి పగ్గాలు అందించనున్నారు. వచ్చే నెల 74వ పడిలో అడుగుపెట్టనున్న అజీం ప్రేమ్‌జీ.. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి జూలై 30న రిటైరవుతున్నారు. ఆ తర్వాత నుంచి అజీం కుమారుడు, సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్, బోర్డు సభ్యుడు అయిన రిషద్ ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు చేపడతారు. రిటైరయ్యాక అజీం ప్రేమ్‌జీ అయిదేళ్ల పాటు 2024 దాకా విప్రో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. ఆయన వ్యవస్థాపక చైర్మన్‌గా ఉంటారని విప్రో పేర్కొంది. ‘దేశ టెక్నాలజీ పరిశ్రమ దిగ్గజాల్లో ఒకరు, విప్రో వ్యవస్థాపకులు అయిన అజీం ప్రేమ్‌జీ దాదాపు 53 ఏళ్లు కంపెనీకి సారథ్యం వహించిన తర్వాత జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన కంపెనీ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు విప్రో తెలియజేసింది. మరోవైపు చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆబిదాలి జెడ్ నీముచ్‌వాలాను మరో విడత అయిదేళ్ల పాటు సీఈవో, ఎండీ హోదాల్లో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విప్రో ఎంటర్ప్రైజెస్, విప్రో–జీఈ హెల్త్‌కేర్ చైర్మన్‌గా అజీం ప్రేమ్‌జీ కొనసాగుతారు. షేర్‌హోల్డర్ల అనుమతుల మేరకు జూలై 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని విప్రో వివరించింది. ‘ఇటు విప్రో, అటు టెక్నాలజీ పరిశ్రమ పెను మార్పులకు లోనవుతున్న తరుణంలో అన్ని వర్గాలకూ ప్రయోజనాలు చేకూర్చేలా కృషి చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని రిషద్ పేర్కొన్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు.. వంట నూనెల సంస్థగా మొదలైన విప్రోను 8.5 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా అజీం తీర్చిదిద్దారు. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ను అంతర్జాతీయ ఎఫ్ఎంసీజీ సంస్థగా నిలబెట్టారు. ఇన్ఫ్రా ఇంజినీరింగ్, మెడికల్ డివైజ్‌ల తయారీ తదితర రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరించారు. వీటి ఆదాయం దాదాపు 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన అజీం ప్రేమ్‌జీ రిటైర్మెంట్ తర్వాత దాతృత్వ కార్యకలాపాలు, సేవా కార్యక్రమాల్లో మరింతగా పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. ‘ఈ సుదీర్ఘ ప్రస్థానం ఎంతో సంతృప్తికరం. భవిష్యత్‌లో మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యకలాపాలకు మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నాను. కంపెనీని అధిక వృద్ధి బాట పట్టించగలిగే సామర్థ్యాలు రిషద్‌కు ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. తన పేరిటే ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ప్రేమ్‌జీ సేవా కార్యకలాపాల్లో ఉన్నారు. ఈ ట్రస్టు కు రూ. 52,750 కోట్ల విలువ చేసే విప్రో షేర్లను ఈ ఏడాది మార్చిలో ఆయన విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ ఫౌండేషన్ విద్యా రంగంలో సేవలు అందించడంతో పాటు బడుగు వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న దాదాపు 150 పైగా స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. -
భవిష్యత్ ఐటీకి సన్నద్ధం కావాలి
న్యూయార్క్: పరిశ్రమలు, సంస్థలు, వాటిని నడిపించేవారికి వేచి చూసేందుకు తగినంత సమయం లేదని, ఐటీ రంగం ఆధునికీకరణ సంతరించుకోవడానికి ముందే భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సన్నద్ధం కావాలని నాస్కామ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సూచించారు. ఆధునికీకరణ అంటే అది కేవలం ఆర్టి ఫీషియల్ టెక్నాలజీ, బ్లాక్ చెయిన్ తరహా టెక్నాలజీలకే పరిమితం కాదని, యాజమాన్యం, నైపుణ్యాల మార్పూ అవసరమేనన్నారు. మారే టెక్నాలజీ తీరుతెన్నులే ఆధునికీకరణను నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇందుకు అనుగుణంగా నడుచుకోవడమే మన ఎంపికగా పేర్కొన్నారు. ఈ రోజు ఇదే నాయకత్వ సవాలుగా అభివర్ణించారు. అమెరికాలో జరిగిన నాస్కామ్ ఈ సమ్మిట్‌లో ప్రేమ్‌జీ పాల్గొని మాట్లాడారు. పరిశ్రమకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు, అనలిస్ట్‌లు, కంపనీల అధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నవి పనిని, కస్టమర్ల అనుభవాన్ని ఏ విధంగా మార్చేస్తున్నాయన్న అంశంపై చర్చ జరిగింది. డిజిటైజేషన్ అన్నది ఇంకా చాలా ముందస్తు దశలోనే ఉందని, ఈ విషయంలో కంపెనీలు, పరిశ్రమలు మరింత పరిపూర్ణత సాధించాల్సి ఉందని రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. డేటా, టెక్నాలజీ ప్రయోజనాలను, కస్టమర్ల అవసరాలను పూర్తిగా అర్థం చేసుకుంటే వృద్ధి చెందేందుకు అవకాశాలు అపరిమితమని సూచించారు. రిషద్ ప్రేమ్‌జీ విప్రో కంపెనీ బోర్డు మెంబర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. వాస్తవాలను చూడాలి... హెచ్1బీ వర్క్ వీసాల విషయంలో ట్రంప్ సర్కారు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఐటీ ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొనడంతో దీనిపై రిషద్ ప్రేమ్‌జీ స్పందిస్తూ... వాస్తవం నుంచి మనోభావాన్ని వేరు చేసి చూడాలన్నారు. ‘‘ఏటా 65,000 హెచ్1బీ వీసాలను జారీ చేస్తున్నారు. ఇందులో భారత ఐటీ రంగం 10,000లోపే వాడుకుంటోంది. 70 శాతం వీసాలు భారతీయులకే వెళుతున్నాగానీ, అవి భారత కంపెనీలకు కాదు. ఇది చాలా చాలా ముఖ్యమైన అభినందించాల్సిన అంశం. అమెరికాలో 2020 నాటికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌లో 24 లక్షల మంది నిపుణుల కొరత ఉంటుందని కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం కంప్యూటర్, ఐటీ అనుబంధ సేవల్లోనే ఉండనున్నాయి’’ అని ప్రేమ్‌జీ వివరించారు. అమెరికాలో టెక్నాలజీ రంగంలో 70 లక్షల మంది పనిచేస్తుంటే మనం కేవలం 10,000 మంది గురించి మాట్లాడుతున్నామని, సెంటిమెంట్‌ను పక్కన పెట్టి వాస్తవాన్ని చూడాలన్నారు. చైనాలో రెండో ‘భారత ఐటీ కారిడార్’ బీజింగ్: చైనా సాఫ్ట్వేర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను భారత్ ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ రెండో ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. అతిపెద్ద చైనా మార్కెట్లో భారత కంపెనీలకు అవకాశాలు కల్పించేందుకు గాను గుయాంగ్ పట్టణంలో ‘డిజిటల్ కొల్లాబరేటివ్ అపార్చునిటీస్ ప్లాజా’ (సిడ్కాప్) పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చైనా గుయాంగ్ మున్సిపల్ చీఫ్, నాస్కామ్ కలసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు భారత ఐటీ కంపెనీలు, చైనా కస్టమర్ల మధ్య జరిగాయి. గతేడాది డిసెంబర్లో నాస్కామ్ చైనాలోని డాలియన్ పట్టణంలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం గమనార్హం. 50 లక్షల ఉద్యోగాలు న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో డిజిటల్ పరిణామం వేగాన్ని సంతరించుకుందని, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డేటా అనలైటిక్స్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని ఐడీసీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ విభాగాల్లో నైపుణ్యాల కొరత గణనీయంగా ఉందని, ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు బలంగా ఉన్నాయని సర్వే పేర్కొంది. డేటా మేనేజ్మెంట్, అనలైటిక్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ అన్నవి కీలకమైనవిగా మారతాయని తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 29 లక్షల ఉద్యోగాలు, ఉత్తర అమెరికాలో 12 లక్షలు, లాటిన్ అమెరికాలో 6 లక్షల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పేర్కొంది. -
నాస్కామ్ కొత్త చైర్మన్ ఎంపిక
సాక్షి, బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఛైర్మన్‌గా గ్లోబల్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రోకు చెందిన ముఖ్య ఎగ్జిక్యూటివ్ ఎంపికయ్యారు. నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు, విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషాద్ ప్రేమ్‌జీని నియమించారు. 2018-19 సంవత్సరానికి కొత్త నాస్కామ్ ఛైర్మన్‌గా రిషాద్ నియమితులయ్యారనీ నాస్కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చీఫ్‌గా ఉన్నరామన్ రాయ్ స్థానంలో రిషద్ ప్రేమ్‌జీ 2018-19 సంవత్సరానికి ఛైర్మన్‌గా ఉంటారని నాస్కామం ఒక ప్రకటనలో తెలిపింది. వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేష్ ఇప్పటివరకు నాస్కామ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న రిషద్ స్థానంలో ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యుఎస్ఎన్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులయ్యారు. -
మెప్పించని విప్రో..!
క్యూ4 నికర లాభం రూ. 2,286 కోట్లు; 2.1% వృద్ధి ⇒ ఆదాయ వృద్ధి 3.9 శాతం; రూ. 12,171 కోట్లు ⇒ షేరుకి రూ.7 తుది డివిడెండ్... ⇒ బోర్డులోకి ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ... బెంగళూరు: భారత్‌లో మూడో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో.. మిశ్రమమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. అయితే, విప్రో ప్రేమ్‌జీ పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని బోర్డులోకి తీసుకురావడం ఈసారి ఫలితాల ప్రకటనలో కీలకంగా నిలిచింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 2.1 శాతం వృద్ధితో రూ.2,286 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.2,239 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.11,704 కోట్ల నుంచి రూ.12,171 కోట్లకు పెరిగింది. 3.9 శాతం వృద్ధి చెందింది. ఇక ప్రధానమైన ఐటీ సేవల ఆదాయం క్యూ3లో 6 శాతం వృద్ధి చెంది రూ.11,240 కోట్లకు చేరింది. డాలర్ల రూపంలో చూస్తే 1.77 బిలియన్ డాలర్లు(3.2% వృద్ధి)గా నమోదైంది. మార్కెట్ వర్గాలు సగటున క్యూ3లో ఐటీ సేవల ఆదాయం రూ.11,399 కోట్లు(డాలర్లలో 1.79 కోట్లు) ఉండొచ్చని అంచనా వేయగా.. దీనికంటే తక్కువగానే కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16) తొలి త్రైమాసికం(క్యూ1, ఏప్రిల్-జూన్)కు ఆదాయ అంచనా(గెడైన్స్) తగ్గింది. 1.76-1.79 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే(క్యూ2) కంపెనీ లాభం సీక్వెన్షియల్‌గా 3.7 శాతం పెరిగింది. క్యూ2లో లాభం రూ.2,203 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం రూ.12,085 కోట్ల నుంచి నామమాత్రంగా 0.7 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా ఐటీ సేవల ఆదాయం డాలర్ల రూపంలో 1.2 శాతం, రూపాయి ప్రాతిపదికన 0.9 శాతం క్షీణించడం గమనార్హం. ‘డిజిటల్, ఓపెన్‌సోర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలు భవిష్యత్తు వ్యాపారాభివృద్ధిలో కీలక పాత్ర పోషించునున్నాయి. కొన్ని విభాగాల్లో ఇబ్బందులు నెలకొన్నప్పటికీ.. మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని విప్రో సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల(బీఎఫ్ఎస్ఐ) రంగం నుంచి వ్యాపారంలో కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. తయారీ, హెల్త్‌కేర్, రిటైల్‌లో పటిష్టమైన వృద్ధి కనబడుతోందన్నారు. పూర్తి ఏడాదికి ఇలా... 2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 11.03 శాతం ఎగబాకి రూ.8,706 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది లాభం రూ.7,840 కోట్లుగా ఉంది. ఇక ఆదాయం 8.14 శాతం వృద్ధితో రూ. 43,754 కోట్ల నుంచి రూ.47,318 కోట్లకు ఎగసింది. కాగా, ఐటీ సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధి చెంది రూ.44,020 కోట్లుగా నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే ఈ మొత్తం 7.08 బిలియన్ డాలర్లు(7 శాతం వృద్ధి). ఇతర ముఖ్యాంశాలు... ⇒ మార్చి చివరినాటికి ఐటీ సేవల విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,58,217కు చేరింది. ⇒ క్యూ4లో కొత్తగా 65 మంది క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది. ⇒ రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుపై కంపెనీ రూ.7 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ⇒ కంపెనీ షేరు మంగళవారం బీఎస్ఈలో 0.67% నష్టంతో రూ.579 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలొచ్చాయి. వారసుడొచ్చాడు... విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తన వారసత్వ పగ్గాలను అప్పగించేందుకు తొలి అడుగు పడింది. చాన్నాళ్లుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన పెద్ద కుమారుడు 38 ఏళ్ల రిషద్ ప్రేమ్‌జీని విప్రో డెరైక్టర్ల బోర్డులోకి తీసుకొచ్చారు. హోల్‌టైమ్ డెరైక్టర్‌గా ఆయనను నియమిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కంపెనీ వ్యూహాల్లో, విలీనాలు-కొనుగోలు డీల్స్ విషయంలో ఆయన కీలకమైన పాత్రను పోషిస్తూవస్తున్నారని కూడా వెల్లడించింది. కాగా, రిషద్ ఇప్పటికే విప్రో ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా ఇంజనీరింగ్ సంస్థ), విప్రో-జీఈ జాయింట్ వెంచర్ సంస్థ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లో బోర్డు సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం. హార్వర్డ్‌లో విద్యాభ్యాసం చేసిన రిషద్... 2007 జూన్‌లో తొలిసారిగా బిజినెస్ మేనేజర్ స్థాయిలో కంపెనీలోకి ప్రవేశించారు. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. మూడేళ్ల తర్వాత కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, తాజా నియామకంతో ఇక టాప్ పోస్టుకు మార్గం సుగమమైనట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, చిన్న కొడుకు తారిక్ ప్రేమ్‌జీ విప్రో ఫౌండేషన్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం విప్రోలో ప్రేమ్‌జీకి నేరుగా 3.78 శాతం వాటా ఉండగా.. ఆయనకు చెందిన ఇతర సంస్థల ద్వారా దాదాపు 70 శాతం వాటా ఉంది. మార్చి చివరినాటికి విప్రోలో రిషద్ వాటా 0.03 శాతం. 1945 డిసెంబర్లో అజీమ్ ప్రేజ్జీ(69 ఏళ్లు) విప్రోను నెలకొల్పారు. ప్రస్తుతం 17.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 48వ స్థానంలో ఉన్నారు. కాగా, వాటాదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే రిషద్‌కు బోర్డులో చోటు దక్కిందని సీఈఓ టీకే కురియన్ వ్యాఖ్యానించారు.