వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై చివరి వరకు నాది అదే మాట అంటూ ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వార్తల్లో నిలచిని సంగతి తెలిసిందే. తనకు వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై నమ్మకం లేదని వారానికి 70 గంటలు యువత పనిచేయాల్సిందేనని అన్నారు. అప్పుడే భారతదేశం అభివృధ్దిచెందుతుంది అంటూ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
కొందరూ సీఈవోలు ఆయన మాటకు మొగ్గుచూపగా కొందరూ ఉద్యోగులు, టెక్కీలు మాత్రం ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజగా విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ బెంగళూరు టెక్ సదస్సు 2024లో ఇదే అంశంపై అత్యంత షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఏ సంస్థం ఇలాంటి ఆఫర్ ఇవ్వదంటూ సరొకత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అలాగే వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది సదరు ఉద్యోగి బాధ్యతే అంటూ కౌంటరిస్తూ మాట్లాడారు. ఇంతకీ రిషద్ ప్రేమ్‌జీ ఏమన్నారంటే..
"పని-జీవిత సమతుల్యత"ను ఎవరికి వారుగా నిర్వచించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో వెసులబాటు అందిస్తామని ఏ సంస్థలు లేదా కార్యాలయాలు ఉద్యోగికి ఆఫర్లు ఇవ్వవు. అదంతా మన చేతిలోనే ఉంది." అని అటున్నారు రిషద్. తాను ఈ విషయాన్ని కరోనా ప్రారంభ సమయంలోనే తెలుసుకున్నానని అన్నారు.
ఈ విషయమై చాలామంది ఉద్యోగులు కంపెనీలపై ఆరోపణలు చేస్తుంటారు. అది సబబు కాదని అన్నారు. నీ సీనియర్ ఉద్యోగులు లేదా పై అధికారులు అదనపు భారం లేదా భాద్యతలు మోపితే దాన్ని సదరు ఉద్యోగే వారితో మాట్లాడి చాకచక్యంగా పని భారం తగ్గించుకునే యత్నం చేయాలి. నీ వర్క్ విషయంలో నీకంటూ ఓ సరిహద్దు ఏర్పాటు చేసుకోవాలి.
దాన్ని అధిగమించేలా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడితే సంస్థకు లేదా పై అధికారులకు వాస్తవాన్ని వివరించి తెలివిగా పనిని బ్యాలెన్స్ చేసుకోవాలని అంటున్నారు. చాలావరకు ఉద్యోగుల నుంచి వచ్చే మొదటి ఫిర్యాదు పని ఒత్తిడి..అస్సలు దీని గురించి మీ టీమ్ ఇన్‌ఛార్జ్, లేదా సూపర్‌వైజర్‌తో చర్చింకుండా మౌనంగా అన్నిటికి తలాడిస్తూ..కోరి మరీ పని ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారని రిషద్ ఆరోపించారు.
ఏ సంస్థ కూడా ఉద్యోగిని బొట్టు పెట్టి మరీ వర్క్‌లైప్ బ్యాలెన్స్ మెయింటైన్ చెయ్యమని చెప్పదు. దాన్ని ప్రతి ఉద్యోగి తనంతటా తానుగా నిర్వహించుకోవాల్సిన సున్నితమైన అంశం. అంతేగాదు పై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని పని సమతుల్యతను అందించేలా వాతావరణాన్ని క్రియేట్ చేయాలి.
అప్పుడే సంస్థ ఉద్యోగి ఒత్తిడులు, టెన్షన్‌లు, పని సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకుని వెసులుబాటు కల్పించగలిగే అవకాశం ఉంటుందంటున్నారు రిషద్. అంతేగాదు ఈ వర్క్ లైప్ బ్యాలెన్స్ అనేది ముమ్మాటికీ ఎవరికి వారుగా నిర్వహించుకోవాల్సిన విషయం అని బెంగళూరు టెక్ సదస్సులో రిషద్ గట్టిగా నొక్కి చెప్పారు.
(చదవండి: పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!)
Comments
Please login to add a commentAdd a comment