విప్రో మాజీ ఉన్నతస్థాయి ఉద్యోగుల తీరును తప్పుబడుతూ కోర్టును ఆశ్రయించడంపై కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందించారు. మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రిషద్ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రో ఉద్యోగులు వారు చేస్తున్న పనిలో గోప్యత పాటించడం అవసరం. ఆ గోప్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత అంశాలకు తావులేదని చెప్పారు.
మా ఉద్దేశం అదికాదు.. వేరే ఉంది
వ్యాజ్యాలు ఉద్యోగుల ఉపాధిపై దెబ్బకొట్టేందుకు కాదని, కేవలం వారు కుదుర్చుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నవంబర్‌లో, విప్రోలో సీఎఫ్‌ఓగా పనిచేసిన జతిన్ దలాల్‌పై దావా వేసింది. అతను విప్రోలో సీఎఫ్‌ఓగా పనిచేసిన వెనువెంటనే కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌ఓగా చేరారు. తద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపించింది.
అందరిది ఒకే మాట
క్యూ3 ఫలితాలు ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్‌జీ సీఈఓ థియరీ డెలాపోర్టే గతంలో ప్రస్తావించిన అంశంపై మాట్లాడారు. కంపెనీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్‌పై వ్యాజ్యాలు దాఖలు చేయడం కంపెనీ కాంట్రాక్టు ఉల్లంఘించినందుకే తప్పా ఇందులో వ్యక్తిగత అంశాలకు చోటులేదని చెప్పారు. ఇప్పుడు ఇదే అంశాన్ని రిషద్ ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment