
సాక్షి, బెంగళూరు: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో సంస్థ సీఈవో, ఎండీ అబిదాలి జెడ్ నీమూచ్‌వాలా తన పదవులకు రాజీనామా చేశారు. కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విప్రో సంస్థ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన సీఈవో నియామకం జరిగే వరకూ అబిదాలి సీఈవోగా కొనసాగనున్నారు. ‘75 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగిన విప్రో సంస్థకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని అబిదాలి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. (విప్రో లాభం రూ.2,456 కోట్లు)
కాగా మాజీ టీసీఎస్ సీనియర్ ఉద్యోగి అయిన నీముచ్‌వాలా 2015 ఏప్రిల్1న విప్రో సీవోవోగా ఆ తర్వాత ఏడాది సీఈవోగా నియమితులయ్యారు. ఇక అబిదాలి రాజీనామాపై విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ స్పందిస్తూ ‘అబిద్’ విప్రోకు చేసిన కృషికి కృతజ్ఞతలు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment