నాస్కామ్ కొత్త ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ (ఫైల్ ఫోటో)
సాక్షి, బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఛైర్మన్‌గా గ్లోబల్ సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం విప్రోకు చెందిన ముఖ్య ఎగ్జిక్యూటివ్ ఎంపికయ్యారు. నాస్‌కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు, విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషాద్ ప్రేమ్‌జీని నియమించారు. 2018-19 సంవత్సరానికి కొత్త నాస్కామ్ ఛైర్మన్‌గా రిషాద్ నియమితులయ్యారనీ నాస్కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చీఫ్‌గా ఉన్నరామన్ రాయ్ స్థానంలో రిషద్ ప్రేమ్‌జీ 2018-19 సంవత్సరానికి ఛైర్మన్‌గా ఉంటారని నాస్కామం ఒక ప‍్రకటనలో తెలిపింది.
వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేష్
ఇప్పటివరకు నాస్కామ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న రిషద్ స్థానంలో ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యుఎస్ఎన్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment