Nasscom chairman
-
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్ చైర్‌పర్సన్‌గా 2023–24 సంవత్సరానికి అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్ వైస్ చైర్మన్‌గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు. టీసీఎస్ బిజినెస్, టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ అయిన కృష్ణన్ రామానుజం ఇప్పటి వరకు నాస్కామ్ చైర్ పర్సన్‌గా సేవలు అందించగా, ఆయన స్థానంలో అనంత్ మహేశ్వరి పని చేయనున్నారు. కాగ్నిజంట్ ఇండియా చైర్మన్, ఎండీగా ఉన్న రాజేష్ నంబియార్‌ను నాస్కామ్ వైస్ చైర్మన్‌గా నియమించారు. -
నాస్కామ్ కొత్త చైర్మన్ ఎంపిక
సాక్షి, బెంగళూరు: ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఛైర్మన్‌గా గ్లోబల్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రోకు చెందిన ముఖ్య ఎగ్జిక్యూటివ్ ఎంపికయ్యారు. నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) విప్రో అధిపతి అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు, విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ రిషాద్ ప్రేమ్‌జీని నియమించారు. 2018-19 సంవత్సరానికి కొత్త నాస్కామ్ ఛైర్మన్‌గా రిషాద్ నియమితులయ్యారనీ నాస్కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చీఫ్‌గా ఉన్నరామన్ రాయ్ స్థానంలో రిషద్ ప్రేమ్‌జీ 2018-19 సంవత్సరానికి ఛైర్మన్‌గా ఉంటారని నాస్కామం ఒక ప్రకటనలో తెలిపింది. వైస్ చైర్మన్‌గా కేశవ్ మురుగేష్ ఇప్పటివరకు నాస్కామ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న రిషద్ స్థానంలో ముంబైకి చెందిన గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీ డబ్ల్యుఎస్ఎన్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేశవ్ మురుగేష్ నియమితులయ్యారు. -
నాస్కామ్ చైర్మన్ గా గుర్నానీ..
♦ వైస్ చైర్మన్‌గా రమణ్ రాయ్ ♦ ఈసారి ఐటీలో 14% వృద్ధి అంచనా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ, వైస్ చైర్మన్‌గా బీపీవో గురు.. క్వాత్రో గ్లోబల్ సర్వీసెస్ సీఎండీ రమణ్ రాయ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ఉన్నారు. బుధవారమిక్కడ విలేకరులతో గుర్నానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 108 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయన్నారు. ‘‘ఈ సారి ఐటీ రంగ వృద్ధి 12-14 శాతం మేర ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2.5 లక్షల పైచిలుకు నియామకాలు ఉండే అవకాశముంది’’ అన్నారాయన. 2018 మార్చిలో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఐటీతో కలసి నాస్కామ్ హైదరాబాద్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించనుందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాబోయే రోజుల్లో ప్రోడక్టు కంపె నీలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలకు నాస్కామ్ ప్రతినిధిగా మారగలదని మోహన్ రెడ్డి చెప్పారు. 2020 నాటికి ఐటీ రంగం ఆదాయాలు 250 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయన్నారు. ఇంకా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో టెక్నాలజీ హబ్‌లు ఏర్పాటు చేశాం. మరిన్ని చోట్ల నెలకొల్పేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి’’ అని ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం నివేదికను రూపొందించిందని, త్వరలోనే దీన్ని ప్రభుత్వానికిస్తామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. -
బిగ్ డేటాలో నాస్కామ్ శిక్షణ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిగ్ డేటా, బిజినెస్ అనలిటిక్స్ రంగంలో అపార అవకాశాల నేపథ్యంలో భారత వృత్తి నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటుకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇది సాకారం కానుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. బిగ్ డేటా, అనలిటిక్స్‌పై గురువారమిక్కడ ప్రారంభమైన నాస్కామ్ రెండు రోజుల సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బోధన ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్ రంగంలో దేశంలో 50 వేల మంది నిపుణులు ఉన్నారు. నిపుణుల సంఖ్య వచ్చే ఐదేళ్లపాటు ఏటా 20 శాతం వృద్ధి చెందుతుంది. 2020 నాటికి అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి 400 సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంది’ అని చెప్పారు. డేటా అనలిటిక్స్ రంగంలో నిపుణులకు డిమాండ్ చాలా ఉంది. ఒక్క యూఎస్‌లోనే 1.40 లక్షల మంది నిపుణులు అవసరమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్టార్టప్‌లతో మార్కెట్ జోష్.. దేశంలో అనలిటిక్స్ రంగంలో 370 స్టార్టప్ కంపెనీలు నిమగ్నమయ్యాయని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ విశ్వనాథన్ తెలిపారు. రూ.9,450 కోట్ల విలువైన అనలిటిక్స్ పరిశ్రమ ఈ కంపెనీలతో వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు. హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా చట్టాలను భారత కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయన్న వార్తలపై మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. అక్కడి చట్టాలకు లోబడే కంపెనీలు వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తున్న ఈ నేపథ్యంలో ప్రపంచమంతా తూర్పు దేశాలవైపే చూస్తోందన్న విషయాన్ని నాస్కామ్ సైతం విశ్వసిస్తోందని అన్నారు. భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు.