ప్రముఖ ఈ -కామర్స్ కంపెనీ అమెజాన్ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. అమెజాన్ సంస్థ తన ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచేందుకు సిద్దం అవుతుంది. అమెరికాలో పని చేస్తున్న తన ఉద్యోగులకు చెల్లించే గరిష్ట బేస్ వేతనాన్ని 1.60 లక్షల డాలర్ల నుంచి రూ.3.5 లక్షల డాలర్లకు పెంచేందుకు సిద్దం అవుతున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. అంటే వేతనం రెట్టింపు కానున్నది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగాలకు కూడా ఈ వేతనం పెంపు వర్తించనున్నది.
ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటు కొత్తగా నియమకాలు చేపట్టనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో ప్రతిభావంతులను కాపాడుకోవడంతో పాటు బయటి నుంచి ప్రతిభ ఉన్నవారిని నియమించుకునేందుకు చూస్తున్నట్లు తెలిపింది. ఈ పోటీ మార్కెట్లో సిబ్బందిని కాపాడుకునేందుకు వేతన పెంపు ఉంటుందని సూచించింది. సిబ్బంది బేసిక్ శాలరీని బట్టి పరిహారం ఉంటుందని, అయితే, స్టాక్ యూనిట్లలో ఆంక్షల్లేకుండా సైన్ ఆన్ బోనస్‌లు, ఇతర బెనిఫిట్లు లభిస్తాయని అమెజాన్ చెప్పింది. గతేడాది అమెజాన్ గోదాములో పనిచేసే సిబ్బంది వేతనాలను గంటకు 15 డాలర్ల నుంచి 18 డాలర్లకు పెంచింది. వేర్‌హౌస్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాల్లో ఇంకా1.25 లక్షల మందిని నియమించుకోనున్నామని వివరించింది.
(చదవండి: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..!)
Comments
Please login to add a commentAdd a comment