వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 27న ఈమేరకు కార్మికుల యూనియన్‌తో చర్చించనుంది. ఉద్యోగుల సమ్మె కారణంగా తయారీ కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితం చెందనట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కంపెనీకి భారీ ఆర్డర్లున్న 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు చెప్పారు.
బోయింగ్ ఉద్యోగులు 2008 తర్వాత చేస్తున్న ఈ సమ్మెలో పలు డిమాండ్‌లను లేవనెత్తారు. యూనియన్‌లోని దాదాపు 32,000 మంది సభ్యులు 40 శాతం వేతనం పెంచాలంటున్నారు. దాంతోపాటు ఉద్యోగుల పెన్షన్ స్లాబ్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సంస్థ మాత్రం 30 శాతం వేతనాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. కానీ సంస్థ ఆఫర్‌కు యూనియన్ సిద్ధంగా లేదని ఉద్యోగులు లేచ్చి చెప్పారు. తప్పకుండా 40 శాతం వేతన పెంపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల బోయింగ్ యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపింది. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. వచ్చే నాలుగేళ్లలో 25 శాతం వేతన పెంపు చేస్తామని కంపెనీ ఇప్పటికే హామీ ఇచ్చింది. అయితే ఆ ప్రతిపాదనను ఉద్యోగులు తోసిపుచ్చారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా వేతనాల పెరుగుదలపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాగైనా తమ డిమాండ్‌ను భర్తీ చేయాలని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 27న మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: ఏళ్లు గడిచినా గతం గుర్తుండేలా..
ఉద్యోగుల నిరసనలో భాగంగా సీటెల్, పోర్ట్‌ల్యాండ్, ఒరెగాన్‌లో విమానాల తయారీ నిలిచిపోయింది. సెప్టెంబర్ 13 నుంచి కొనసాగుతున్న ఈ సమ్మె వల్ల ఉత్పాదకత తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. బోయింగ్ అత్యధికంగా అమ్ముతున్న 737 మ్యాక్స్ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తిని సైతం నిలిపేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment