సుందర పాండియన్ చిత్రం ద్వారా పరిచయమైన దర్శకుడు ఎస్‌ఆర్ ప్రభాకరన్. ఆ చిత్రం హిట్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. శశికుమార్ కథానాయకుడుగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును గెలుచుకున్న దర్శకుడు ఎస్‌ఆర్ ప్రభాకరన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. అవార్డులు దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం కథను రాయలేదని, సహజత్వంగా ఉండాలన్న దృష్టిలో పెట్టుకుని కథలు రాశానన్నారు. దర్శకుడు, నటుడు శశికుమార్ కూడా కథా చిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉండాలని భావిస్తారన్నారు.
శశికుమార్ వద్ద సహాయకుడిగా పని చేశానని ఆయన చిత్రాలు చాలా యదార్థంగా ఉంటాయని తెలిపారు. ఆయన నిర్మిం కథానాయకుడిగా నటించిన సుందరపాండియన్ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డును అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం శశికుమార్ కథానాయకుడిగా ముందానై ముడిచ్చు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా నటి తాన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రలో రెక్కై ములైత్తేన్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా రరల్ పొలిటికల్ క్రైమ్ కథాంశంతో కొలైక్కారన్ కైరేఖగళ్ పేరుతో వెబ్‌సిరీస్‌ను జీ–5 సంస్థ కోసం రపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కలైయరసన్ వాణిభోజన్ జంటగా నటిస్తున్నారని తెలిపారు.
అలాగే ఇతర దర్శకులకూ అవకాశం ఇస్త చిత్రాలు నిర్మించాలనే ఆలోచన ఉందన్నారు. తనకు నటుడు అవ్వాలన్న ఆసక్తి లేదని, మంచి చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులో చిత్రాలు చేసి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తెలుగులోనూ చిత్రాలు చేసే ఆలోచన ఉందని చెప్పారు. చిత్రాలు ఓటీటీలో విడుదల చేయడం వ్యాపారం కోసం అని పేర్కొన్నారు. కాగా ఇటీవల నటీనటులు వారి సహాయకుల వేతనాలను వారే చెల్లించాలని తెలుగు సినీ వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, దీనిని కోలీవుడ్‌లోనూ అమలు పరచడానికి తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment