'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. నాలుగేళ్ల క్రితం నటించిన రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే టాలీవుడ్ బహిష్కరిస్తామంంటున్నారని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పాయల్ సినిమాను ప్రమోట్ చేయడానికి డేట్లు కేటాయించకపోవడంపై నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్ ఠాకూర్ నుంచి మార్చిలోనే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు.
అతను ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాడని తెలిపింది. కానీ ఇందుకు పాయల్ సహకరించలేదని.. మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ప్రమోషన్స్‌కు వస్తే ఆమెకు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వెల్లడించారు.
ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. మేనేజర్ ద్వారా పాయల్‌ను కలిసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని టీఎఫ్‌పీసీ పేర్కొంది. ఈ చిత్రంలో పాయల్ నటించినందున ప్రమోషన్స్ సమయంలో ఆమె పేరును ఉపయోగించుకునే హక్కు నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్‌కు ఉందని వారు పేర్కొన్నారు.
బ్యాన్ చేస్తామంటూ..
కాగా.. అంతకుముందు పాయల్ తనను బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ సినిమా ప్రమోషన్లకు పాల్గొనకపోతే టాలీవుడ్‌లో నిషేధిస్తామంటున్నారంటూ ఆరోపించింది. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పిందని.. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.
'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్
రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే.
Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film "Rakshana" Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council pic.twitter.com/0TlzpYmA3s
— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2024
Comments
Please login to add a commentAdd a comment