
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రమే విక్రయించా లనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చరిత్రాత్మకం’’ అని ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’(టీఎఫ్‌పీసీఏపీ) అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టిక్కెట్ల దోపిడీ గురించి తెలుసుకున్న జగన్‌గారు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు.
దీనివల్ల ప్రేక్షకులకు వినోదం భారం కాదు.. పైగా నిర్మాతలు చిత్ర నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు దోహదపడుతుంది.. బడ్జెట్ అదుపులో ఉంటుంది. జగన్‌గారి ఆలోచన చిత్రపరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా కార్మికులకు, చిన్న నిర్మాతలకు మేలు జరుగుతుంది. కానీ కొంత మంది నిర్మాతలు తమ వ్యక్తిగత లాభాలకు గండి పడుతుందని భావించి, ఆ ఆలోచన తప్పు అని ప్రచారం చేస్తున్నారు. త్వరలో జగన్‌గారిని కలిసి, పరిశ్రమలోని సమస్యలను వివరిస్తాం’’ అన్నారు.
చదవండి: Mrunal Thakur: విరాట్ కోహ్లిని పిచ్చిగా ప్రేమించాను: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment