
ఈ నెల 26న షూటింగులు రద్దు
ఈ నెల 26వ తేదీన సినిమా షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది.
అందులో పేర్కొంటూ దక్షిణ భారత సినీ, బుల్లితెర స్టంట్ దర్శకులు, స్టంట్ కళాకారుల సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన చెన్నైలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనుందన్నారు. అందువల్ల ఆ రోజున షూటింగులను రద్దు చేయవలసిందిగా కోరడంతో అంగీకరించినట్లు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు పేర్కొన్నారు.